పుట:కాశీమజిలీకథలు -04.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24]

హేమప్రభ కథ

185

ఆ దూతలు భాస్కరునివార్త యందలి జనులవలస విని విచారింపుచుఁ బోయి తమ ఱేని కెఱింగించిరి. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దదనంతరోదంతము తరువాతి మజలీయం దిట్లని చెప్పదొడంగెను.

నలువది యొకటవ మజిలీ

హేమప్రభ కథ

అచ్చట భాస్కరుఁడు పరోపకారమునకై సముద్రములోఁబడి కొంతసేపునకుఁ గన్నులుదెఱచి చూచినంత మణిమయ స్తంభసుందరమగు నొక దివ్య మందిరములో శాకములతట్టలోఁ బడినట్లు తెలిసికొని యట్టె లేచినలుమూలలు చూచుచు నయ్యారే ! యిదియేమి చోద్యము? నేను సముద్రములోఁబడి మునిఁగితినిగదా ? యీ మందిరమెక్కడిది ? యిది ఇంద్రజాలమా ? లేక స్వప్నమా? యిందలి విశేషము లరయ స్వర్గమువలెఁదోచుచున్నది. నేను మృతినొంది స్వర్గమున కరిగితినా ? యిది నా పూర్వదేహమువలెనున్న దిగదా! ఆ తెలిసినది నేనీదేహముతోనే పుణ్యలోకమున కరిగితిని గాఁబోలు అగునిందలి విశేషము లరసెదంగాక! యని తలంచుచుఁ గొంత దూరము తిరిగి అదిగో ! యెవ్వతెయో భయంకరాకారముతో నిటువచ్చుచున్నది దీనింజూడ భయము గలుగుచున్నదిగదా ? ముక్కును మొగమును వికృతముగా నున్నవి. నోరు గుహవలెఁ దెఱవఁబడి యున్నది. నాలుక జ్వాలవలె వ్రేలాడు చున్నది పురాణములో రాక్షసస్త్రీనిట్లువర్ణింతురు. స్వర్గములో రాక్షసి యుండ నేమిటికోకదా ? దీనియెదుటఁ బడితినేని నన్నుఁ గబళములాగున నోఁటిలోవైచికొనును. దాఁగియుండెదనని తలఁచి యొకమూల నడఁగియుండెను. అంతలో నారక్కసి నిప్పులుగ్రక్కుచువచ్చి యందొకపీఠంబునం గూర్చుండి అయోముఖీ ? యెక్కడ నున్నావు ? ఆహారము సిద్ధపఱచితివా ? యని యడిగినది. అప్పుడొక మూలనుండి యయోముఖివచ్చి దేవీ ! యంతయు సిద్ధపఱచితిని. కాని అని యర్థోక్తిగాఁ బలికి యూరకున్నంత నాజ్వాలాముఖి సగముమాటాడి యూరకుంటివేమి ? మనుష్య మాంసము వచ్చినదా ? లోహధ్వజమును విడుచుట మఱచితిరాయేమి? యని యడిగినది.

దేవీ ! లోహధ్వజము వాడుకవేళనే విడిచితిని. ఏమికారణముచేతనో కాని మనుష్యశరీరమువచ్చి శాకములతట్టలోఁ బడియుండలేదు కాదీవఱ కెప్పుడును వలఁబడ్డ ---వలెవచ్చి చచ్చిన శవము శాకకుసూలములో నుండునది. ఒక్కొక్కసారి నేల బడిన మనుష్యులు వచ్చిపడియుండువారు. దానిగుఱి తప్పినదేమో తెలియదని చెప్పిన ------------ నాకు మయుఁడిచ్చిన వరమేల తప్పును ? నీవే కపటము జేసితివని