పుట:కాశీమజిలీకథలు -04.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లేపక యెక్కడనో యున్న మంత్రితోఁ జెప్పుమనుటయు నా మాట విని యతండడ్డము పోయెననుటయు నెంత యుచితముగా నున్నదియో విచారింపుఁడు.

భర్త - అవును. ఇది యసందర్భముగానే యున్నది. కాని యా చిన్నవాఁ డాయపరాధము దాను జేసిన ట్లొప్పుకొనెనఁట. అది కాదనుట యెట్లు ?

భార్య - ఆ చిన్నవాఁడు కడు గుణవంతుఁడు అందులకుఁ గారణ మేదియో యున్నది. నాకు మఱియొక యూహగూడఁ దోచుచున్నది. వీఁడు కడుఁ జక్కనివాఁడు. రాజుభార్య వీనింజూచి మోహించి యుండును. వీఁడు సమ్మతింప నప్పు డీదారిఁ ద్రొక్కియుండును.

భర్త - అబ్బా ! యెన్ని సారాంశముల నేరుచుంటివి? నీకు ధర్మాధికార మిచ్చినచోఁ దీరుపులు చక్కగా దిద్దుదువు గదా !

భార్య – సందేహమేలా ? యీ యపరాధముల విమర్శింప నా కధికార మిప్పింపుఁడు. నిజము త్రుటిలో పట్టుకొని చెప్పించెదను.

భర్త - ఱేపు రాజుతోఁ చెప్పెద నుండుము. నీకు వేతనమేమి కావలయును?

అని పరిహాసముగా మాటలాడికొనిరి. వానిలోఁ గొన్ని మాటలు రాజునకు వినంబడలేదు. చివరి మాటలు మాత్రము స్పష్టముగా వినంబడినవి. ఆయిల్లు గురుతుఁ జూచుకొని మఱియొక వీధికిం బోయెను. అందుఁ జారుమతి యున్న యింటిపంచను నిలువంబడినంత నామె యిట్లు విచారింపుచున్నది.

సీ. పరులబ్రోవఁగ నిజ • ప్రాణముల్విడుచువాఁ
               డెటు చంపు మంత్రిని • హేతుకముగఁ ?
    దరుణులందఱ గన్న • తల్లుల గతిఁజూచు
               పట్టి భూపతిపత్నిఁ • బట్టుటెట్లు ?
    కలనైన ననృతంబు • దొలకనీయిని ధర్మ
              శీలుఁ డుగ్రక్రియ • ల్సేయుటెట్లు ?
    దీనుల దై న్యముల్ • దిలకింప విలపించు
              కరుణాలుఁ డెట్టు ల • క్రమముఁ జేయు ?

గీ. నయ్యయో ? తెలియలేక రా • జతని చిత్త
   వృత్తి యపరాధి యనుచు భా • వించి యకట
   కఠినశిక్షవిధించె హా ! • కన్నతండ్రి !
   కర్మసూత్రంబు నిన్నిట్టు • గట్టెనయ్య.

ఆ దీనాలాపము లాలించి యా రాజు డోలాయిత హృదయుండై యింటికిఁ జని మఱునాఁడు ప్రాతఃకాలంబునఁ జారుమతి వసియించి యున్న యింటి యజ