పుట:కాశీమజిలీకథలు -04.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజువాణి కథ

179

యనుభవింపవలసి యుండునో వారినచ్చటికిఁ దీసికొని పోయి దైవము దానినిఁ గుడిపించును. అట్టి దాని విషయమై భ్రాంతిపడ నేమిటికి ? నేను బోయి వచ్చెద నాజ్ఞ యిమ్ము నా కొఱకుఁ జింతింపకుము. దేహ ప్రధానంబున నైన నొరుల కుపకారముఁ గావింపుము. నీ వెఱుంగని దానవు కావు. స్వార్థపరత్వ మెవ్వరికిని గూడదని యెన్నియో బోధించి యామె నూరడించెను.

పిమ్మట రాజభటులు లతనిం దీసికొనిపోయిరి. నిగళబద్ధుండైన యా రాజ కుమారునిం జూచి యావీటిలోఁ గన్నీరు గార్చనివారలులేరు. నిత్య మతనియొద్ధసత్కారముల నందు దరిద్రులు వాని వృత్తాంతము విని గోలున నేడ్చుచు వెంటబడిపోవఁ జొచ్చిరి. రాజభటులు వారినెల్ల వారించుచుఁ గ్రమంబునఁ బురనదీపట్టణారణ్యభూముల దాటించి సముద్రయానమున ద్వీపాంతరమునకుఁ దీసికొనిపోయిరి.

యశస్కరుని కథ

రాజు రాజపుత్రుని కట్టి శిక్షవిధించి యశస్కరుండు ఆముదిన్న పశువు వలెఁ గొట్టుకొనుచు నేమియు దోచక యెద్దియో విచారము చిత్తమున వేధింప నాఁటి రాత్రి నిద్రఁబోవక ప్రజలు తన్నేమనుకొనుచున్నారోయని యూహించి మాఱువేషము వై చికొని వీధులవెంబడిఁ దిరుగఁజొచ్చెను. అప్పుడొక యింటిలో భార్యాభర్తల కిట్టి సంవాదము జరిగినది.

భార్యా - ప్రాణేశ్వరా ! యిందాక శిక్ష పడిన చిన్న వానిం జూచితిరా ? పాప మెంత చక్కగా నుండెనో ? ద్వీపాంతరమునకుఁ దీసికొని పోయి వానిం జంపుదురా యేమి ?

భర్త - వానిం జూచిన నీకు జాలిపుట్టినదా ? వాఁడు చేసిన క్రూర కృత్యమున కాశిక్ష చాలదనియే నా యభిప్రాయము. ద్వీపాంతరమునఁ గొన్ని దినములుంచి పిమ్మట జంపుదురు.

భార్య - వాఁ డాయపరాధము చేసెననియా మీ యభిప్రాయము ? వట్టిది. వట్టిది రాజు గ్రహింపలేకపోయెను.

భర్త - అబద్దమని నీ వెట్లు చెప్పఁగలవు?

భార్య - నిజము బయలు పడకుండునా? (మెల్లగా) ప్రధానికిని మంజువాణికిని సంబంధ మున్నదను కింవదంతి మీరు విని యుండరా ?

భర్త - అది నే నెఱుఁగ. అదియా? తరువాత ?

భార్య - అతని రాక గ్రహించి ఆ చిన్నవాఁడు నిన్న రాత్రి మంత్రిని ఖండించియుండును. అది మఱయొక రీతి వీనిమీఁదఁ ద్రోసివేసిరి. కాకున్న నింటి యొద్దనున్న మంత్రిచావనేల ? యంతఃపురములో నపరాధము జరుగఁగా నచ్చటివారిని