పుట:కాశీమజిలీకథలు -04.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పురుషవేషము వైచి మందహాసముతో నద్దముఁ జూపుచుఁ దరుణీ! ఇప్పుడు నీవు కంతు వసంతజయంతాదుల మించి యుంటివి. నీ మనోహరాకారముఁ జూచినంతనె యువతులు మోహవివశలు కాకుందురా? ఆహా! పురుషవేషమున నీ మోమెంతవింతగా నున్నదియో చూచికొనుము. తుమ్మెదచాలు చేరని బాలకమలము వలె మెఱయుచున్నది సుమా? అని పొగడఁగా విని యముద్దియ తన వేషము నిలువుటద్దములోఁ జూచికొని వెరఁగందుచు నిట్లనియె.

అగు నగు మీరని నట్లు నామొగము నాకే క్రొత్త యగుచున్నది. తఱుచు స్త్రీలు పురుషవేషము వైచునప్పుడు మనోహరముగా నుందురు. నన్నుఁ జూచి యెవ్వరును గురుతు పట్టజాలరు కదా? కానిండు. ఈ యుపాయము మపాయరహితమైనదే ఇఁక మీవేషములకుంగూడఁ తగిన దుస్తుల నేరి యుంపుడు. సాయంకాల మగుచున్నది. మనము వేకువజాముననే లేచిపోవలయును. ఈగుహామార్గ మెంతదూర ముండునో యని పలికిన విని యాయిరువురును పరిచారక వేషములు వైచికొని యామెవద్దకు వచ్చిరి. లవంగి మొదటావా రెవరో క్రొత్తవారనుకొని సందియమందుచు నవ్వినంతనె గుఱుతుపట్టి యచ్చెరువందుచు వోహో! సఖులారా! మిమ్ము నించుకయు గుఱుతు పట్టలేకపోయితిని సుఁడీ నవ్వినం దెలిసినది మీవేషములు సమయోచితములుగానున్నయవి. మనకు భగవంతుఁడు మంచి యుపాయమే తోఁపించెను. నాకు నెడమకన్ను పాదము నదురు చున్నవి. తప్పక మనకోరిక తీరఁగలదు. రేపీవేళకు మనము విశ్వనాథున కభిషేకము చేయగలము. మఱి యే యంతరాయములు రాకుండ నుండవలయునని యనేక ప్రకారములఁ దలంచుచు నెట్టకే నాదివసముఁ గడిపినది.

అంత నా రాత్రి నా పద్మనేత్రలు తమ యంతఃపురములోనికి నితరులు రాకుండ నియమించి వేకువజామునలేచి పురుషవేషముతో నా పాతాళమార్గమునఁ గరదీపికలు గయికొని నడువం దొడంగిరి. ముందు చెలికత్తియలు నడుచుచు దారిఁ జూపుచుండ నా రాజపుత్రిక తదేకధ్యానమున నడుచుటచే గమనాయాస మించుకయు గణింపదయ్యెను. అట్లు రెండుగడియలు నడచువరకు నొకచోట నడ్డముగా దలుపు కనంబడినది.

వా రాతలుపుచీల నూడలాగి తలుపుఁ దెరచి యా దారియందున్న మెట్ట నెక్కిరి. ఆ ప్రదేశము గుఱుతు పెట్టుకుని మఱల నా తలుపుమూసి మఱికొంత దూరము నడచినంత క్రోశముదూరములోఁ గాశీపట్టణము కనంబడినది. అప్పు డరుణోదయ మగుచున్నది. కావున నందుగల యాలయ ప్రాకారమంటపాదులు తెల్లముగాఁ దెలియబడుచున్నవి. అప్పుడు లవంగిమేనుప్పొంగ హస్తంబులుజోడించి గద్గదకంఠముతో-