పుట:కాశీమజిలీకథలు -04.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

21

చ్చును. దారులలోఁ బరీక్షించుచుందురు. నేను జూచుచుండగఁనే పెక్కండ్రు హిందువులు నజారులెక్కి పురిలోని కరిగిరి. ఇప్పుడు బలవంతముచేసి యరుగలేము. నీవేషభాషలు స్వభావముచేతనే హిందువులం బురుడించుచుండును. మే మిరువురము హిందువులమేకదా? మనము పురుషవేషములు వైచికొని హిందువులమని చెప్పి యరుగుదము. నిరాటంకముగాఁ బోవచ్చును. ఇంతకన్న వేఱొకరీతిఁ గార్యసాఫల్యము కాదు.' ఆ మాటల విని రాజపుత్రి మిక్కిలి సంతసించుచు నట్లుజేయుటకు సమ్మతించి యొరు లెఱుఁగకుండఁ గోటలోనికి రాకపోకలు జరిగించుట యెట్లని శంకచేసినఁ గుందలతిక యిట్లనియె.

'ద్వారపాలురు మాయెఱుంగనివారు కారు. మావెంట నీవు పురుషవేషముతో వచ్చుచుండ శంకింపరుగదా. దీన నభ్యంతరమేమి యున్న' దని పలికిన విని సంగీతచంద్రిక 'సఖీ! అదియంత యుచితముగా లేదు. మనము పురుషవేషములు వైచికొని పోవలయుంగదా అట్టి పని రహస్యముగా జరుపవలయునుగాని దాసరివారి పోలికమారి బయల వేషములు మార్చుట యుక్తముగాదు. సాయంకాలములోపున భగవంతుఁడు వేఱిక యుపాయము తోపింపకపోపునా ? ఏదియు దొరకనప్పుడు నీవు చెప్పినట్లే చేయుద' మని పలికినది. ఆ మాటకు రాజపుత్రియు ననుమోదించినది.

పిమ్మట నాయంగజాన లిరువురుఁ గోట వెడలునుపాయ మాలోచించుచుఁ గోటగోడ దాట నేవియేని సాధనము లున్న వేమోయని యాప్రాకారముచుట్టును విమర్శనపూర్వకముగాఁ దిరుగఁజొచ్చరి. అందు నయఃపేటికాసదృశంబైన గుప్తభవనంబున నొక యినుపకవాటమొకటి కనంబడినది. దానిం బరీక్షించి వారిరువురు ప్రయత్నపూర్వకముగా గడియఁ గనుంగొని యెట్టకేదానిం దఱచిరి. అందు సోపానములున్నవి. వానివెంబడిన కొంతదూరము పోయిరి. ఆ మార్గము నున్నని పాషాణములచేఁ గట్టం బడుటచే నడచుటకు మృదువుగానున్నది. నిర్భయముగా నా తరుణు లా తెఱవునంబడి పోవఁబోవ గొంతదూరమున నొక తలుపడ్డమైనది. దాని చీలం గనుంగొని యాతలుపుఁ దెఱచిరి. ఆ మార్గము కాశీపురమున కనతిదూరములోనున్న యొక చిన్నమెట్టమీదికిఁ బోయినది. ఆ గుఱుతు లన్నియు గ్రహించి యమ్మించుబోఁడులు జెందుచు మఱల నాతలుపులు వైచికొని యథాగతముగాఁ బోయి రాజపుత్రితో నా వృత్తాంతమంతయుం జెప్పిరి.

శత్రువులు కోట ముట్టడించినప్పుడు తప్పించుకొని పోవుటకై కోటఁ గట్టునప్పుడు గుప్తమార్గము లుంచుట వాడుక యగుటచే నాదారి యట్టిదని తెలిసికొని యా లవంగి దానిం దెలియఁజేయుచు విశ్వేశ్వరుని యనుగ్రహమే యని పరమానందము జెందుచుఁ బ్రయాణసన్నాహముఁ గావింపుఁడని తొందరపెట్టినది.

పిమ్మట నాకొమ్మ లిరువురు లవంగికిఁ బట్టుదుస్తులు గట్టి యంగీలు తొడిగి కౌశేయోష్ణీషము శిరంబునం జుట్టి రత్నకటయంకాంగనీయాది వస్తువిశేషముల నలంకరించి