పుట:కాశీమజిలీకథలు -04.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమవిగ్రహము కథ

171

పుచు నంతలో నతండు చదివిన పద్యమును జ్ఞాపకముఁ జేసికొనుచుఁ బలు తెరంగులఁ జింతా సముద్రములో మునింగి కొట్టుకొనుచు దేవభట్టు రాక కెదురు చూచుచుండెను.

అంతలో విజయభాస్కరుఁడు వచ్చి తల్లి కి నమస్కరించి అమ్మా ! అట్లు దుఃఖించుచుంటి వేమిటికని యడిగెను. ఆమె పుత్రునిం జూచి వీఁడు మా ముద్దుల తండ్రియే అయ్యో ! యెట్లు వచ్చితివి ? దేవభట్టుపై నిచ్చటివారలు వేసిన నిందలు వట్టివి కాఁబోలు. బహ్మరాక్షసుని కాహారముగా నిన్నుఁ దీసికొని పోయెనని వింటి. అబ్బా ! నా దుఃఖమేమని చెప్పుదును ? పోనిమ్ము కన్నులం బడితివి యింతియబాలు నని పలుకుచు నతని శిరము మూర్కొని చెక్కులు ముద్దుఁ బెట్టుకొనుచుఁ బెద్దతడవు గారవించినది. అప్పు డతండు నవ్వుచుఁ దనపోయి వచ్చిన వృత్తాంత మంతయుం జెప్పిన విని యామె నెరఁగు పడుచుఁ బుత్రా నా పనియేమి చేసి పోయితివని యడిగినది. అమ్మా ! నీకుఁ బలుమారు చెప్పనక్కఱలేదు. మరణము విధి విధించెనా యెక్కడున్నను దప్పదు లేనిచో నెక్కడికిఁ బోయినను భయము లేదు. ఇదియే నిశ్చయము ఇదియే దేవరహస్యము. అందరి పనియుం జేయువాడు దైవము. నాకేమియు భయము లేదని యెఱింగియే యటుపోయితిని.

మన వృత్తాంత మెల్ల రకుఁ దెలిసినది. ఇఁక మనమిందుండరాదు. ఎఱుఁ గని దేశమునకుఁ బోయి కాలము గడుపుకొనియెద మని పలికిన విని తల్లియు ననుమోదించినది. దేవభట్టు రాక పూర్వమే వారా యగ్రహారము విడిచి మఱియొకదేశమునకు బయనము సాగించిరి. నడుచు నప్పుడును చారుమతి వత్సా ! యెట్టియిడుములైనఁ గుడువ వచ్చునుగాని నడచుట గష్టము గదా ? నడక యనిన నాకు వెఱపు గలుగు చున్న దె. యెక్కడనైన నొక్కచో వసియించి యుదరపోషణ చేసికొనఁ జాలమా యెంతకాలమిట్లు తిరుగుచుందుము ? మనకు గమ్యస్థాన మేది ? యని యడిగినఁ కుమారుండు వగచుచుఁ దల్లీ ! సుగుణ సంపన్నుఁడగు రాజు నరసి యతని యొద్ద గొల్వుఁ జేసెదను. దానం గాలక్షేపము గాఁగలదు. నీవు చింతింపకు మని యోదార్చెను.

అయ్యో ! సేవకవృత్తి గడు దుర్ఘటమైనది గదా ! ప్రభువులమదినరసి యెట్లు వర్తింతువు ? అన్నా ! పెక్కండ్ర బరిచారకుల యూడిగములఁ గై కొని నీ విప్పు డొక్కని యాజ్ఞకులోనై పనులఁ గావింతువా ! యని చారుమతి విచారింపఁ జొచ్చినది.

అట్లు వారు కొన్ని పయనంబులు సాగించి యొకనాడు శోభావతియను పట్టణంబునకుం జని యందొక విప్రునింటఁ బసఁ జేసిరి. ఆ యింటి బ్రాహ్మణుని వలన యశస్కరుండను చరంబరఁగు నా పట్టణపు రాజు వృత్తాంతము విని యతండు సేవనీయుండని నిశ్చయించి తల్లి యనుమతి వడసి మఱునాఁ డుదయ కాలంబున నా రాజకుమారుఁడు తత్సమ యోచితమగు వేషముతో యశస్కరుని యాస్థానమునకుంజనియెను. ఆ రాజు రాజుపుత్రుని యాకార విశేషములం జూచి వెరఁగుపడుచు 'అనఘా !