పుట:కాశీమజిలీకథలు -04.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నకు సోకింపుము. శాపవిముక్తుండనై పవిత్రుఁడ నగుదునని పలుకు చున్నట్లు చేసి వారినెల్ల వీడ్కొని జ్వాలముఖుం డంతర్థానమై పోయెను

అప్పుడు చంద్రావలోకుఁడు రాజపుత్త్రుం గౌగిలించుకొనుచు వత్సా ! నీవు విక్రమార్కుని మనుమఁడవా ? అయ్యో ! ఈ బ్రాహ్మణుఁడు తన కుమారుండని మోసముఁ జేసెనే ? నీ రూపము జూడ నా కప్పుడే సందేహము గలిగినది. మమ్ము నెల్లఁ గృతార్థులం గావించితివి నీ కతంబున నేను బ్రహ్మహత్యా పాతకముఁ జెంద నైతి నని స్తోత్రముఁ జేయుచు నచ్చటినుండి పరివారమును గలిసికొని యా వృత్తాంత మంతయుం జెప్పుచు వెండియు విజయభాస్కరు నా మత్తగజముపై నెక్కించి యధా తధముగా మేళతాళములతో నూరేగింపుచుఁ బట్టణములోనికి దీసికొని పోయి బెద్ద యుత్సవముఁ గావించెను.

ఆ రాజప్పుడు తన్నుఁ బునర్జీవితుఁగాఁ దలంచి విజయభాస్కరుని యనుమతి ప్రకారము దేవభట్టున కప్పుడే యా విగ్రహముతోఁ గూడ నూఱు గ్రామములు దాన మిచ్చి సగౌరవముగా వారి వారి యగ్రహారముల కని పెను రాజపుత్త్రునకుఁ దన యర్థ రాజ్యమిత్తునని చెప్పెను. కాని యతం డనుమోదింపక తల్లిం జూచు వేడుకతో వారితోఁ గూడ నృపతి యనుమతి వడసి యా యగ్రహారమునకుం బోయెను.

అక్కడ గుమారుండరిగిన వెనుక నిరుగు పొరుగువారు చారుమతి యొద్దకు వచ్చి "అమ్మా ! నీ వెంత వెఱ్ఱిదానవోకదా ! దేవభట్టు నీ కుమారు బ్రహ్మరాక్షసునికి బలియిచ్చుటకై తీసికొని పోయెనని చెప్పుకొనుచున్నారు. ప్రొద్దున వచ్చిన హేమ విగ్రహమును జూచి యతని కాశ జనించినది. తనకుఁ బదుగురు పుత్త్రులుండ నీ పుత్త్రుం దీసికొని పోనేల ? నీ వెట్లంగీకరించితి వమ్మా ! ఇప్పుడైనఁ దగవు వెట్టినచోఁ దీసికొని రావచ్చును. వీనిఁ దనకుమారుఁడని చెప్పి నూఱు గ్రామములు లాగ వలయునని తలంచుచున్నాఁడు. నీవీ మర్మమేమియు నెఱుంగవు కాఁబోలు నని యా వృత్తాంత మంతయుం జెప్పిన నేలంబడి మూర్చిల్లి యొడలెఱుంగక యొక్కింత తడవునకుఁ దెప్పిరిల్లి యిట్లు దలంచినది.

అయ్యో ! కుమారా ! నన్నెంత మోసముఁ జేసిపోయితివిరా ? గడ్డము పట్టుకొని బ్రతిమాలిన నేమోయనుకొంటిని. ఎప్పుడు నేమియు గోరనివాఁడవు కోరితివని యంగీకరించితిని. చివరఁ బద్యము జదివి నప్పుడై నఁ దెలిసికొనలేక పోయితినిగా ! అన్నన్నా ! బ్రాహ్మణుఁడా ! ద్రవ్యాశచేతఁగదా యిట్టి పనికిఁ బూనుకొంటివి ? ఆ యిల్లాలైనఁ జెప్పినది కాదే. గుణసారుఁ డెంతవాఁడయ్యెను ! నాతోఁ జెప్పి పోయిన నింత చింతయుండక బోవునే. అయ్యో ! హృదయములోఁ దరంగముల వలె నేవియో పుట్టుచున్నవి. ఎట్టు లణంచుకొందురు. నన్నోదార్చు వారెవ్వరు ? నీ ----------- కించుక యేదియేని సోఁకిన మే నంతయుఁ గందువది. యిప్పు డాబ్రహ్మరాక్షసుని వాడి కోరలు సోకిన నెట్లు సైతవురా ? నాయనా ! యని యనేక ప్రకారముల శోకిం