పుట:కాశీమజిలీకథలు -04.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

21]

చంద్రావలోకుని కథ

161

క్షత్రియునకు శస్త్రధారణము దీనరక్షణమునకుఁగా బ్రహ్మ విధించెను. కులఁబోఁ బ్రోసి బ్రజల న్యాయముగాఁ బాలింపుము. చలలక్ష్యాధి లక్షణంబుల నెఱుంగ సాధనముఁ జేయుము. రాజ్య సుఖం బనుభవింపుము. ధనం బర్దులకుఁ బంచి పెట్టుము. యశము దిక్కుల వెదజల్లుము. కృతాంత క్రీడితమగు హింసాకర్మమున కెప్పుడు నుద్యోగింపకుము. మృగయా వ్యసనంబునఁ బాండురా జెట్టి యిడుములఁ గుడిచెనో యెఱుంగవా ? యని బోధించిన విని సంతసించుచు, మహీపతి యిట్ల నియె.

మహాత్మా ! నే నిప్పుడు మీచే లెస్పగా శిక్షింపఁ బడితితిని. అనుగ్రహించితిరి. ఇఁక నెన్నఁడును మృగయా వినోదము సేయను. సత్వములు నిర్భయముగాఁ దిరుగుఁగాక మీ యానతి వడుపున మెలంగువాఁడ నని పలికిన సంతసించుచు నా సిద్దుండు రాజా ! నీవు ప్రాణుల కభయదాన మిచ్చితివి కావున నీ యందు నా కక్కటికము గలిగినది. నీ కిద్దియేని యభీష్ట ముండినం జెప్పుము దీర్పఁ గలవాఁడ నని యడిగిన నయ్యొడయం డిట్ల నియె. మహాత్మా ! మీకు సంతోషమేని యీ యిందీవరప్రభను నాకు వివాహము గావింపుడు. ఇదియే మదీయ వాంచితం బింతకన్న వేఱొక్క కోరిక నాకు లేదని పలికిన నా సిద్ధుండనుమోదించి స్నానముఁ జేసి యరుదెంచిన యమ్మించుబోడినప్పుడే యతని యధీనం గావించెను. చంద్రావలోకుండు గాంధర్వ వివాహంబున నిందీవరప్రభను స్వీకరించి స్వదేశగమనోత్సుకుఁడై యాసిద్దు ననుమతివడసి యప్పడఁతిని దత్తడిపై నెక్కించుకొని యుత్తరాభిముఖుండై యరుగు చుండ నింతలోఁ బద్మి నీకాంతుం డపరిగిరి శిఖరము నలంకరించెను.

అతండా రాత్రి వసింపఁ దగిన తావరయుచుండ నొక దండ సమృద శాఖపత్ర విచిత్రంబగు నశ్వత్థ పాదపంబు నయనోత్సవంబు గావించినది. తదగ్ర భాగమున శీతలజల భూ యిష్టంబగునొక దిగుడు బావి విరాజిల్లుచున్నది. తత్ప్రదేశంబు నివాసయోగ్యంబని తలంచి యజ్జనవల్ల భుం డప్పల్లవపాణితోఁ గూడ వాఱువమును దిగి జేరువ భూరుహమునకుం గట్టి యయ్యచ్చరపట్టి కేలు బట్టుకొని యర్వాపీపితా తలంబునకుఁ దీసికొనిపోయి శీతలవాత పోతములు గమనాయాసము బాయఁజేయ హాయిగ గొంతసేపందు విశ్రమించెను.

అంతలో శర్వరీ కాంతుఁడు పూర్వదిగ్వధూకబరికాకుసుమ వల్లరింబోలె నుదయించుటయుఁ గ్రమంబునఁ జంద్రిక రాలింగితములై దిక్కులు మిక్కిలి ప్రకాశింపఁ దొడంగినవి. అట్టి సమయంబున నన్నరపతి కుసుమశయ్యఁ గల్పించుకొని యం దయ్యిందీవర ప్రభాపరిష్వంగంబు గావించుకొని నూతన సంగమోర్కర్ష సంతోషంబునం దేలుచు తదీయ రావణ్యామృత నిష్యందములఁ గ్రోలునట్లు నేరములు: 1. మ : ముద్దుపెట్టుకొనుచు మోము ముసల న న ... ము. సవరించి సంపచనరచనలు ఆ సరయు నౌకణజు వెంటే... -