పుట:కాశీమజిలీకథలు -04.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రావలోకుని కథ

159

యడిగిన దేవభట్టు కొండవీటిలోనే యుంటిని. నేనిచ్చటికి రావలయునని పయనమగుచుండఁ గొందఱు రాజభటులు నవరత్న ఘటితమగు హేమావిగ్రహ మొకటి దీసికొని వచ్చి డిండిమముతో నూరేగించిరి. ఆవింతఁ జూచుచు నందాగితినని చెప్పిన నవ్వి గ్రహ వృత్తాంత మెట్టిదో చెప్పుఁడని యడిగిన భార్యకుదేవభట్టిట్ల ని చెప్పఁ దొడంగెను.

చంద్రావలోకుని కథ

ఇక్కడి కనతి దూరములో రత్నకూటమసు నగరము కలదు. ఆ పురము చంద్రావలోకుండను నృపాలుండు పాలించుచుండెను. రూపమునకు విలాస నివేశమనియు కార్యమున కాలవాలమనియు విద్యల కుత్పత్తి నికేతన మనియు విద్వాంసులా భూవల్లభుని వర్ణించుచుందురు. అతనికిఁ బెక్కండ్రు భార్యలు గలరు. కాని యొక్కరితయు నతని మదికెక్కిన చక్కఁదనము గలదికాదు. ఆ చింత యొక్కటియే యతనిం బాధించుకున్నది

ఒకనాఁడమ్మహారాజు వాఱువపుదళములు సేవింప వేటకై యరణ్యమున కరిగి యందు నాఖేటనపాటవంబు దేటపడ సింహశరభ శార్దూలాది మృగగణంబుల వాఁడితూపుల నేపుమాపి యొక్కచోఁ దనహయరత్నమును దీపప్రాష్ణిన్ ప్రహారంబునఁ బ్రేరేపించుటయు నవ్వారువంబు మిఱ్ఱుపల్లంబుల లెక్కఁగొనక పవనాధి జవంబున ముహూర్త మాత్రములోఁ బదియోజనముల దూరము తీసికొని పోయి మఱియొక యరణ్యములోఁ బ్రవేశ పెట్టినది.

అప్పుడా నృపతి యింద్రియ ప్రపంచమును మఱచి యెట్టులో యా గుఱ్ఱముపై నిలిచియుండెను. అత్తురగ మాఁగిన కొంతసేపటికిఁ గన్నులు దెఱచి చూచి నంత నమ్మహీకాంతున కాప్రాంతమందొక సరోవరము కన్నుల పండువు గావించినది. అత్తటాకమును జూచి సంతసించుచు గుఱ్ఱము దిగి కడిగి జలము ద్రాగించి చేరువ భూరుహంబునకుఁ గట్టివైచి మార్గాయాసంబువాయ దా నా తటాకంబునఁ దీర్దంబులాడి జలంబులు గ్రోలి తటనికటస్థవిటపిచ్చాయ విశ్రమించి రమ్యంబులగు తత్ప్రదేశ విశేషంబు లరయుచున్నంత ముందర.

సీ. వికసితవకుళమా . లిక మేఖలగఁ దాల్చి
              నవరసాలములఁ గ • ర్ణములఁ బూని
    కరవీర వల్ల రుల్ • గంకణంబులు సేసి
              రమణీయకుసుమహా • రములువై చి
    దానిమ్మ పూవులు • తాటంకములు గాఁగఁ
              బున్నాగములు నాగ . ముగధరించి
    మందారమంజరు • ల్మంజీరములుసేసి
             విరకాజివిరులఁచే , న్వేణిఁ దురిమి