పుట:కాశీమజిలీకథలు -04.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

20]

నిగమశర్మ కథ

153

కలభాషిణితోఁ గూడ రాజ్యలక్ష్మి మనయధీనము కాగలదని సంతోషింపుచు రాజ్య లాభాంతరమునఁ చేయఁదగిన కృత్యముల నాలోచించుకొనుచుండిరి.

అక్కడఁ జంద్రగుప్తుండు నిగమశర్మ పంపినపిమ్మట నంతఃపురమున కరిగి పుత్త్రికం జీరి “అమ్మా ! తస్కరులు నిన్నెక్కడికిఁ దీసికొనిపోయిరి ? ఎవ్వరు విడిపించిరి ? నీవెంట వచ్చిన బ్రాహ్మణకుమారుఁడు దొంగలంబాఱఁదోలి నిన్ను విడిపించితినని చెప్పుచున్నాఁడు యధార్దమేనా ? యని యడిగిన నాబాలిక యిట్లనియె. జనకా ! పదియాఱేఁడుల ప్రాయముగలిగిన యొక చిన్న వాఁడు తల్లితో నడవిమార్గంబునం బడివచ్చుచు దారిలో నన్ను విడిపించి యీనగరమునకుఁ దీసికొని వచ్చెను. రాత్రి యొక బ్రాహ్మణగృహంబునఁ బవ్వళించితిమి. ఉదయమున వారు నాకుఁ గనం పడలేదు. ఆయింటి బ్రాహ్మణుని కుమారుఁడు పారితోషికము దొరకునని నన్నిక్కడికిఁ దీసికొనివచ్చెను. ఇదియే యదార్థ"మని చెప్పినది. వారేకులమువారో యెఱుంగుదువా ? యని యడిగిన నా చిన్నది "వారు నాకు గులశీలనామంబులు చెప్పలేదు. మార్గస్థుల మని చెప్పిరి. పోలికలుచూడ గొప్పవారివలెఁ గనంబడుదురు. ఆచిన్నవాని సౌందర్యము జూచి తీఱవలయు"నని యామాట లన్నియు జెప్పినది. అప్పుడు మిగుల బుద్దిమంతుఁ డగు నారాజు సందేహము జెందుచు "పుత్రీ : నీవు చెప్పిన వారి నీబ్రాహ్మణులు ద్రోహముచేసిసయుందురని తోచుచున్నది. నిగమశర్మ మాటలన్నియు బూటకములని నే నప్పుడే కని పెట్టితిని. కానిమ్ము ఱేపు ప్రొద్దున్నపోయి వారియిల్లు పరీక్షించి వచ్చెద"నని పలికి యారేయి గడపి మఱునాఁ డుదయంబున మంత్రిసామంత పౌరపరిచార సహితముగాఁ నాబ్రాహ్మణుని యింటికరిగెను. రాజు సపరివారముగాఁ దమయింటికి వచ్చుచున్నాఁడను వార్త యిరుగుపొరుగువారు చెప్పిన విని యాబ్రాహ్మణి తన కుమారునకేఁ బుత్త్రికనిచ్చు తలంపుతో వచ్చుచున్నాఁడని నిశ్చయించి ముఱియుచు మాకు రాజ్యము వచ్చినతరువాత మీకెక్కుడుపకారముఁ గావింతునని చెప్పి కొందఱి నడిగి నూత్నభూషాంబరము లెరవు దెచ్చుకొని కుమారుండు తాను నలంకరించుకొనిరి. అట్టిసమయమున నిగమశర్మ “అమ్మా ! నేనిప్పుడు రాజుగారి కెదురుబోవలయునా?" యని యడిగిన నామె "సరి సరి మన మాయనకు బూజ్యులము. మన కెదురుపోవ నవసరములేదు. అదియునుంగాక కొంచెము బిగించుకొనియుండక పోయినచో నల్లునిఁ దేలికచేయుదురు. ఎవ్వరికోసరము వచ్చెడిని ? మనము లోపలకు వచ్చువఱకుఁ గదలవలదు. ఆయన భార్యవచ్చి నన్నుఁ బిలిచినందాక నీవు వారింటికిఁ బోవలదు. నిన్నుఁ బట్టియె నాకును గౌరవము రాఁగలదు " అని పెక్కుతెఱంగులఁ దలంచు కొనుచు వారు లోపలనే కూర్చుండిరి.

అంతలోఁ జంద్రగుప్తుఁ ను పు ఆయిల .. 13. రము ని ప . pot. "ను ఆ పలు వచ్చి లంగా, పరీక్షించి వచ్చేడ" ..