పుట:కాశీమజిలీకథలు -04.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతాళగృహము కథ

147

రింపక మృగములు రాకుండఁ గాచికొని కూర్చుంటిని. అంతలోఁ గొందఱు దొంగలు సొమ్ము దోచుకొని యీ రహస్య మందిరమునఁ బ్రవేశించి యం దాధన మంతయు దాచికొని మిగిలిన ధనము దెచ్చుటకై వాండ్రు పోయిరి. అప్పుడు నేనీ చిన్న దాని మాట వారి మాటల వలనఁ దెలిసికొని నిన్ను లేపకయే లోపలకుం బోయితిని. ఆ లోపలి యిండ్లవై--- మేమి చెప్పుదును. పాతాళలోకము వలెనున్నది అందొక యమ్మవారి గుడి యెదుట మంటపములో నీచిన్నది యాపస్తంభమునకుఁ గట్టి పెట్టబడిన యజ్ఞ పశువుం బోలె యొక స్తంభమునకు గట్టఁబడి యున్నది. తరువాత దీనిఁదీసికొనివచ్చితినని యా వృత్తాంతమంతయు జెప్పెను.

చారుమతి కుమారుని సాహసవితరణయాశౌర్యౌదార్యాది గుణంబులకు మనంబున సంతసించుచు నా కోమలితో "బాలా ! నీ పేరేమి? తల్లిదండ్రులెవ్వరు? జన్మభూమి యేది ? యీ దొంగలచే నెట్లు పట్టుబడితివి ? నీ రూప లక్షణంబులుచూడ రాజపుత్రిక వలెఁ గనంబడుచున్నావు. నీ వృత్తాంతముఁ జెప్పుము. నీ తలిదండ్రుల యొద్దకుఁ దీసికొనిపోయి నిన్నప్పగింతుము. వెఱవకు మని పలికిన విని యక్కలికి యిట్ల నియె.

అమ్మా ! నా పేరు కలభాషిణియండ్రు. నేను మహారాష్ట్ర దేశాధిపతి యగు చంద్రగుప్త మహారాజు కూఁతురను. మా తల్లి పేరు సౌగంధిక. మా రాజధాని చంద్రప్రస్థము. నేను రాత్రి యంతఃపురములో రత్నడోలికలోఁ బరుండి నిద్ర బోయితిని. ఇచ్చటి కెట్టువచ్చితినో నాకుఁ దెలియదు. మీ మాటలచే దొంగలు దీసికొని వచ్చిరని తోచుచున్నది. మీ రెవ్వరు ? నన్నుఁ గాపాడిన యీ పుణ్యాత్ముఁడు నీకేమి కావలయునని యడిగిన వెఱఁగుపడుచుఁ జారుమతి 'మే మొక మార్గస్థులము. వీఁడు నా కుమారుఁ' డని యుత్తరము జెప్పినది. అప్పు డా చిన్నది ప్రాయమునఁ జిన్నది యైనను బుద్దిచే నధికురాలగుట వారియెడఁ గృతజ్ఞతఁ జూపుచు మధుర వాక్యములచే వారినిఁ బ్రీతి గలుగఁజేసినది. అందులకే దానికి గలభాషిణియని యభిఖ్య వచ్చినది. వారిరువుర వెంటఁబెట్టుకొని రాజపుత్రుఁడు దొంగలు బోయిన దారి విడచి దక్షిణాభి ముఖముగా నడుచుచు గమనాయాసము వాయ నడుమ వృక్షచ్చాయల విశ్రమించుచు నాకలియైన మధుర ఫలంబులఁ గోసి తెచ్చి భుజించుచు రాత్రులయందు దుర్గప్రవేశముల వసించి ఖడ్గపాణియై మృగబాధ రాకుండఁ గాపాడుచు ని రీతి గొన్ని పయనంబులు సాగించి కొన్ని దినంబుల కాయరణ్యము దాటెను. వారు మొదట గనంబడిన పల్లె లోని వారలఁ జంద్రప్రస్థమునకు మార్గ మడిగి తెలిసికొని కతిపయ ప్రయాణముల నాపట్టణము చేరిరి.

నాఁడు పెద్ద చూరము నడిచివచ్చుటచే వారు మిగుల నాయాసముఁజెంచుచు నప్పటికిఁ గొంచెము చీఁకటిపడుటచేఁ బైన నడువలేక యా ప్రాంతమునందున్న యొక్క బ్రాహ్మణ గృహంబునకుంజని యడిగి వారియరుగుపైఁ బరుండిరి. వెంటనే