పుట:కాశీమజిలీకథలు -04.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

19]

పాతాళగృహము కథ

145

మనశ క్తివంటి దేవత యెచ్చటను లేదుసుమీ ? ఆమెకు దండము పెట్టి పోయితిమేనిఁ గన్నముపాఱకమానదు. అన్నన్నా : ఎన్నిదినములనుండి ప్రయత్నము సేయుచున్నామురా ? యిప్పటికి సాగినదిగదా ? రాజాగారికోటలోదూరి దొంగిలించుట సామాన్యమా ? యా బాలిక నీకెట్లు దొరికినదిరా ? యనుటయు వాఁడు లోహజంఘా ! ఇది మనశక్తిగాదు. శక్తిమహిమరా ! రాజుగారి మంచముదాఁవున బంగారుడోలికలో నీ బాలిక నిద్రపోవుచున్నది. మొన్న దండము పెట్టుకున్న మాట జ్ఞాపకమువచ్చి దీనిం బలి యియ్యవచ్చునుగదా అని తలంచి మెల్లన భుజముపై వైచికొని తప్పించుకొని వచ్చితిని. తామ్రకేళునిమాట వింటివా ? యీపిల్లను దనకొడుకునకుఁ బెండ్లిజేసి కొనునఁట ? యిమ్మని యడుగుచున్నాడు. అమ్మవారికి గోపమురాదా !" యనుటయు నతం డిట్లనియె.

చాలుఁ జాలు యెంతమాట! కన్నులు పోవవా ? అమ్మవారి మహిమ వాని కేమి తెలియును ! అయ్యో : యున్న కొలది ఊహలు పుట్టుచుండును గదా ? ఇప్పుడే బలియిచ్చి వచ్చిన బాగుండునే. మన మక్క,డికిఁ బోయి ధనముఁ దీసికొని వచ్చువరకు మఱల నర్థరాత్రము కాగలదు. అనుటయు వాఁడు భయములేదు. మన దీర్ఘ కర్ణుఁడు విని యప్పుడే మందలించెను. ఈ రాత్రి వచ్చిన తక్షణమేతదీయు రక్తముచే నమ్మవారినిఁ దృప్తి పరచెదము గాక ! మనకే వెఱపును గలుగకుండ జేయు భార మామెదేకదా ? యని మాటలాడుకొనుచు వాండ్రందఱు నాతలుపు వైచి యుత్తరాభిముఖులై యరిగిరి. రాజకుమారుండు వారి మాటలన్నియు విని తదుదంతముకొంత కొంత బోధఁజేసికొని యయ్యో : వీండ్రు దొంగలైనట్లు తెల్లమైనది గదా ? ఏరాజు కోటలోనో ప్రవేశించి ధనము దోచికొని వచ్చిరి. అది యట్లుండె. రాజపుత్రికి నెత్తుకొని వచ్చి యమ్మవారికి బలియియ్య నిశ్చయించిరి. ఆ మాట వినినది మొదలు నా హృదయము కొట్టుకొనుచున్నది. ఆ దారింబోయి యా బాలికం గాపాడెదనని తలంచి తల్లిని లేపక యానిశావ సానంబున ఖడ్గపాణియై యా తలుపు తెఱచికొని యందుగల సోపానముల మార్గమున లోపలకుదిగెను. ఆ లోపల విశాలమగు భవనములు పెక్కు కలిగియున్నవి. అందందు బంగారము వెండి రత్నములు రాసులుగాఁ బోయఁబడి యున్నవి. రత్నప్రభలే యక్కడ వలసినంత వెలుతురు గలుగఁ జేయుచున్నవి. మొదటి భవనములు నిర్జనములై యున్నవి. లోపలి భవనములలోఁ జోకుల భార్యా పుత్రాదులున్నట్లెద్దియో ధ్వని వినంబడినది. అందు రాజపుత్రుఁడు నలుమూలలు దిరుగుచు నమ్మవారి యాలయము పసిఁడికుండలం బట్టి గుఱుతుపట్టి దానిలోని కరిగెను.

అందొక శక్తి విగ్రహము కరాళవదనము దీర్ఘబాహువులు -నము చూచువారికి వెఱపుఁగలుగఁ జేయుచున్నది. ఇక అసలు రత్న అన్ని పనులు చేసిన

0గాడు.

a - కుం... నలు. యూ బాలిక నేల లువలు సుపై ఆ చుంగ చట్టం..