పుట:కాశీమజిలీకథలు -04.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

144

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యంతఃపురములలో నతిసుకుమారముగాఁ బెంపఁబడిన నీవీ యడవి ఱాతినేలం నడచు చుండినను మనసు ఱాయిచేసికొని చూచుచుంటినే : అక్కటా ! నీ యుపచారములు నాకెట్లు సుఖకరములుగా నుండును ? అని కన్నీరు గార్చుచుచున్న తల్లి నోదార్చుచు రాజనందనుం డెండ చల్ల బడిన తరువాతఁ దల్లిచేయి పట్టికొని మెల్లన నడపించుచు గొంతపయనము సాగించెను. ఇంతలో ఖరకిరణుం డసరిగిరి శిఖర మలంకరించెను. క్రమంబునఁ జీకటులు కాటుకపూసినట్లు దెసల నావరింపఁ జొచ్చినవి. అప్పుడు రాజుకుమారుఁ డొక పొదరిల్లు బాగుఁజేసి యందుఁ దల్లి తోగూడ వసించెను. చాల ప్రొద్దుపోవువఱకుఁ జారుమతి కుమారునకు విక్రమార్కుని కథలం జెప్పుచు నాటిఁ పగలెల్ల మిక్కిలి యలసటఁజెందినది కావున నిలువలేక నిద్రఁబోయినది. రాజ సుతుండు నిద్రఁబోవక వాలు కేలం గీలించుకొని నలుదెసలం బరికింపుచు మృగబాధఁ బొరయకుండఁ గాపాడుచుండెను.

పాతాళగృహముకథ

అట్టిసమయమునఁ గొందఱు మనుష్యులాదారిని వచ్చుచున్నట్లు ఱొద యైనది. విజయభాస్కరుఁడు కదలక యణఁగి వారిజాడ నరయుచుండెను. అంతలోఁ బదుగురు మనుష్యులు పదిరెండేఁడుల ప్రాయముగల యొక బాలిక నెత్తుకొని ధనము మూటలు శిరమున ధరియించి వారున్న పొదదాపుననే నిలిచి యిదియే యిదియే యని పలుకుచు నందు మూఁటలు దింపిరి. ఒకఁడు తలుపు తెరవ వచ్చునా ? యని యడిగిన మఱియొకఁడు తీయకేమి ? పెఱవారిం దెవ్వరున్నా ? రని యుత్తరముఁ జెప్పెను. అప్పుడొక చెట్టుమొదట నమరించియున్న తలుపులాఁగి తెఱచెను. పిమ్మట నా మూటలన్నియు నెత్తుకొని యా చిన్న దానితో వారెల్ల నాద్వారముగుండ లోపలకుఁ బోయిరి. ఆ వింత కన్నులారఁజూచి విజయభాస్కరుఁడు వీండ్రు దొంగలవలెఁ గనంబడుచున్నారు. ఎవ్వనియిల్లో దోఁచి ధనముఁ దీసికొనివచ్చిరి.

ఇది వీరి రహస్యగృహము గావచ్చును. పాపమా గృహస్తుఁడెంత చింతించుచుండునోకదా ? అదియునుంగాక వాఁడు తలుపు నెమకుచు నగ్గి -------- గొట్టినప్పుడా వెలుతురున నొక బాలికమొగము గనంబడినది. ఒకని భుజముపైఁ బండుకొని నిద్రపోవుచున్నది. ఆ చిన్నది యెవ్వతెయో ? కానిమ్ము. వీరి గుట్టు దెలిసికొని పైకార్య మాలోచించెదనని తలంచుచు మెల్లనలేచి యాపాదపము దాపునకుఁ బోయి యా ద్వారమునుండి లోనికిఁ దొంగిచూచెను. అందు సోపానములు గనంబడినవి. లోనికిఁబోవఁ ప్రయత్నముఁ జేయుచుండ నింతలో లోపలినుండి పైకి వచ్చుచున్నట్లు మాటలు వినంబడినవి. అప్పుడు రాజపుత్రుఁడు యధా ప్రకారము ఉపసంలో ఉదయం జై స్పు.. బాలుడు క్రము అదు. అలపు ముప్పు ,