పుట:కాశీమజిలీకథలు -04.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయభాస్కరుని కథ

143

అప్పుడు చారుమతి ముందుఁ దన్నుఁజంపుఁడని మెడ యొగ్గినది. వీరభటులు విచ్చుకత్తుల నొఱలనుండి పైకిదీసి ఝళిపించుచు నేయరుకించు సమయమున సంవర్త సమయవలాహకంబుభంగి నా ప్రాంతమున బెబ్బులి యొకటి గాండ్రుమని యఱచినది. ఆ ధ్వని విని బెదరచు దూతలు నలుదెసలు చూచుచుండ నా శార్దూలం బాభీల గమనంబున నరుదెంచి భయంకరములగు సఖదంష్ట్రాగ్రంబుల నంత్రంబుల విదళించుచు రాజప్రణిధుల శమనలోకాతిధులం గావించినది.

ఇంతకన్న నద్భుత మేదియైనఁ గలదా ? రాజకుమారుఁడు వారిని రక్షించుటకొఱకు బడియతో నా పులిం జావమోదెను. కాని యది యా దెబ్బల లక్ష్యముసేయక యబ్బాలుని జోలికింబోవక వారిం గడతేర్చి పాఱిపోయినది. అప్పుడా రాజపుత్రుఁడు తల్లితో అమ్మా ! ఈచిత్రముఁ జూచితివా ? మనలఁ జంప గమకింపం గృతాంతుడు వీరినే పరిమార్చెను. ఇంతకుముందు నేను జెప్పిన విషయమం దిప్పుడైన నీకు విశ్వాసము గలిగినదా ! మన కాయుశ్శేష ముండఁగ వీరేమి సేయగలరు ? అని పలుకుటయు నా సతీతిలకము విస్మయ మభినయించుచుఁ బుత్రుని పరమార్థ జ్ఞానమునకు మిక్కిలి సంతసింపఁ జొచ్చినది. అంతలోఁ దెల్ల వారినది. అప్పుడా రాజకుమరుఁ డక్కింకరు కరవాల మొకటి కేల నమర్చుకొని క్షుద్రమృగబాధ నొరయకుండ నరయుచు నల్లన దల్లితోఁగూడ నయ్యడవిలో నొకమార్గమునంబడి నడువసాగెను. మిట్టమధ్యాహ్న మువఱకు నరిగినను గ్రామమేదియుఁ గనంబడినది కాదు. క్ష్పుతిపాసలచేఁ బీడింపంబడి యడుగులు తడబడి నడుచుచున్న?? తల్లికస్తి చూచి తల్లడిల్లుచు నా బాలుండొక నిర్ఝరపరిసరంబున నిలిచి మధురంబులగు ఫలంబుల గోసికొనివచ్చి తల్లి కిచ్చి తానును భుజియించి యందలిలి జలంబులం గ్రోలి యాఁకలి యడంచుకొనియెను. అప్పుడు చారుమతి కుమారునితో పట్టీ : నడచుట నాకు జాల కష్టముగా నున్నయది. పాదములు పొక్కెక్కినవి. నేనీ రాత్రివఱకు నిక్కడనే యుండెదను.

ఏదియో మృగము భక్షించును. దాన వెలతలన్నియుఁ బాయఁగలవు. నీవు వేగముగా నడిచి యీ యడవి దాటిఁపోయి యెందైన బ్రతుకుము. గుణము గలవానికి జీవనము దొరకక మానదు. కలయందైనను నొకరికి బాధఁగలుగఁ జేయకుము. భూతదయగలవాఁడే పరమోత్తముఁడు. మీతాత చరిత్రముఁ జదివికొని యోపినంత పరోపకారము గావింపుచుండుమని పలికిన విని విజయభాస్కరుం డిట్లనియె. అమ్మా : నీవిట్లు దై న్యోక్తుల నాడకుము. నా హృదయము భేదిల్లుచున్నది. నాచెంతనుండ నీకేమి కొఱంతయున్నది ! నేఁడు కాకున్న ఱేపు పోవుదము తొందర యేమున్నది. లేకున్నఁ గొన్నిదినము లీ యడవిలోనే వసింతము. మనకొక ----------- గలదా ? యని చల్లనిమాటలాడుచుఁ దల్లిపాదములొత్తఁదొడంగెను. తల్లి----------- నాకుపచారములఁ జేయుట : అయ్యో ? ఎండ కన్నెఱుగక