పుట:కాశీమజిలీకథలు -04.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

విజయభాస్కరుని కథ

141

కాపురము నిలుపుకొంటినని సంతసించుచుంటినిగాని వానీచునచేష్టల గ్రహింపనైతిని. వీనిచే నీపనిదల్లియే చేయించుచున్నది. కట్టా ! వీని నాప్తులని మన్నించినచో ముప్పు రాకుండునా ? తగినశిక్ష విధింపవలయునని తలంచి రోషావేశముతోముతో నాయర్థులనెల్ల బద్దులంగావించి తద్విత్తము పట్టించుకొని యాస్థానమున కరిగి మంత్రులతో నేదియో చెప్పఁబోవు ------------ నాతురతతో గొందఱు కింకరులువచ్చి స్వామీ ! నమస్కారము, మేము కల్పవృక్షమునకు కావలి వారము. ఇంతకుమున్ను యువ రాజుగారు వచ్చి కల్పవృక్షమునకు నమస్కరింపుచు నీక్రిందిపద్యమును జదివిరి.

ఆముకు తము) : :: .. ముర (ఓర్ప నకు స
స్వల. ఏ సన దాని దించిన యగ్గు లిప్పుడు
క్రమముగా శిక్ష వంపు : లిర్పఁ వారిఁబ్రోచి కా
మము " "PI స్వేచ్చం మా " కృపణాత్ములగొల్వ నేటికిన్.

అని చదువువఱకు నత్తరువరము ఱివ్వున నాకసంబునకెగసి యంతర్దానమైపోయినది. ప్రతిక్రియారహితమగు నక్కార్యంబునకు వగచుచు మేము దేవరకు విన్నవింపఁ జనుదెంచితిమి. ఆ పాదపస్థానంబున జిఱువేరైనలేదు. అగాధమైన గర్తముమాత్ర మున్నదని చెప్పుచుండగనె యాఱేఁడు నఱకఁబడిన మోడువలె నేలంబడి మూర్చిల్లి కొంతతడవునకు లేచి పెద్దయెలుంగున హా ! వంశనాశన ! హా ! పితృ శాత్రవ ! హా : క్రూరాత్మా ! యెంతపని చేసితివిరా ? అయ్యో ! కల్పవృక్షము వలన నెన్నియో ప్రయోజనములు దీర్చుకొనవలయునని యుర్రూట లూరుచుంటిని. తొందరయేల యని యుపేక్ష జేసితినిగదా ! యేదియు లేకపోయినది. ఏమి చేయుదును. సాధన మేమని యనేక ప్రకారముల విలపించుచు మంత్రులచే బోధింపఁ బడియు దెలివిగానక పెద్దతడవు శోకసముద్రములో మునిఁగియుండెను.

పిమ్మట నాసరేకుండు రౌద్రావేశముతోఁ గటంబు లదర బౌమలు ముడివడఁ గన్ను లెఱ్ఱఁజేయుచు బటురవంబున భటులతో మీరిప్పుడేపోయి నా కప్రతికారంబు సహకారంబును గావించిన భార్యాపుత్రుల నిరువుర మహారణ్యమునకుఁ దీసికొనిపోయి వధించిరండు పొండు. తదీయరక్తంబు గన్నులం జూచువఱకు నేను భుజింపను. దీని కించుక వ్యతిరేకము జరిగించితిరేని మిమ్ము సకుటుంబముగాఁ నాశనము జేయింతునని భయంకరముగాఁ బలికి శోకగృహంబునకుం బోయి తలుపులువైచికొని పండుకొనియెను. ఆ సభలో మంత్రులుగాని హితులుగాని పురోహితులుగాని యాతని మాటకడ్డు చెప్పలేకపోయిరి. భయంకరులగు రాజకింకరులప్పుడే యంతఃపురమున కరిగి పుత్రునితో నేదియో ముచ్చటింపుచున్న చారుమతింజూచి నమస్కరింపుచు అమ్మా ! మేమేమి జేయుదుము ? దారుణమగువార్త మీకిప్పుడు చెప్పవలసివచ్చినది. మీరు కుమారునిచేత రాజుగారికి వ్యతిరేకమగు పనులు చేయించిరఁట. అందులకుగాను మిమ్మడవినికిం తీసికొనిపోయి అని చెప్పి కన్నీరు విడచుచు మాటాడలేక యూరకుండిరి.