పుట:కాశీమజిలీకథలు -04.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వ్యసన మధికముగా జొచ్చినది. బడికిఁ బోవుటయుఁ జదువుటయు మాని యతండు రెండుపూటలయందు ధనము దొంగిలించివచ్చి రహస్యముగా నర్దిసాత్కృతముజేయఁ దొడంగెను.

ఇట్లవిచ్చిన్నముగాఁ గొన్నిదినములు జరిగినంత నొక్కనాఁడు కీర్తి కేతుఁడు బొక్కసములఁ బరీక్షించి రొక్కము తక్కువయగుటఁ దెలిసి కావలి వారలం బట్టుకొని నిర్బంధించుటయు వాండ్రు వెఱచి దేవా ! మీకుమారుఁడు మాతృబోధచే వీనిముద్రలఁ బాటవంబున భేదించి విత్తము సంగ్రహించుకొని వీధివీధులం దిరుగుచు నర్దులకుఁ బంచిబెట్టుచున్నవాఁడు. ఆచిన్నవాని నీపట్టణమెల్ల నెఱుంగునని యా యుదంతమంతయుం జెప్పిరి. అప్పు డతండు మండిపడి యేమేమీ ! విజయభాస్కరుఁడే యీధనము హరించినవాఁడు. అన్నన్నా ! ఇంటిదొంగ నెవ్వడు బట్టుకొనగలడు ? తల్లి చెడుబోధయేకదా దీనికిమూలము కానిమ్ము ఈకృత్యమునకుఁ దగినఫలము గుడిపించెదనని తుంచుచు నాకులపాంసునిఁ బట్టియిండని పలికి వారి వెంట విజయభాస్కరుఁడు దానమిచ్చు సమయమున కాప్రదేశమున కరిగెను. అందు-

సీ. భూధవాత్మజ ! నే ని . రాధారుఁడను దివ్య
                నుత : నేను జాల దీ • నుఁడ మహాత్మ !
    బహ్వపత్యుఁడ నేఁ గృ• పావరీతస్వాంత !
               యధికవిద్వాంసుఁడ • ననఘ : నేను
    నాకిమ్ము నాకిమ్ము • నాకిమ్మటంచు గుం
              పులు గుంపులుగఁ దన్న • మూగికొనుచు
    నర్దులు ఱొదసేయ • నలుక యించుక లేక
              మొగమునఁ జిఱునవ్వు • ముద్దుఁగులుక

గీ. జిన్ని చేతులతోడ ముం • దున్న గంప
   లోని బంగారునాణెము , ల్మానికిములు
   చెలఁగి ధాన్యంబువోలె దో • సిళ్ళ కొలఁది
   దాన మొనరించునట్టి నం • దనునిఁ గనియె.

అట్లు వితరణావేశముతోఁ బంచిపెట్టుచున్న పట్టింగాంచి యానృపతి యపరిమితయహంకారముఁ జెందుచు నందనునితోఁగూడ నందున్న వారినెల్ల బట్టుండని కింకరుల కాజ్ఞ యొసంగుటయు నవ్విధంబెఱింగి కురంగంబు తెఱంగున నృపకుమారుం డెరిగి యా గుంపునుండి తప్పించుకొని పాఱిపోయెను. కీర్తికేతుండును కింకరులచే బట్టుఁబడిన యర్థులయొద్దనున్న ధనంబంతయు లాగికొని రాసిగాఁ బోయించి గుండెలు బాదుకొనుచు అయ్యయ్యో ! ఇంతసొమ్ము ప్రతిదినము ప్రజలపాలు సేయుచున్న వీఁడు నాకు శత్రుఁడుగాక పుత్రుండా ? ఇంతకుమున్ను తండ్రిచే చెఱుపంబడిన