పుట:కాశీమజిలీకథలు -04.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయభాస్కరుని కథ

139


శ్లో॥ ఉపదేశోహి మూర్ఖాణాం ప్రపోపాయ నశాంతయే
      పయఃపానం భుజంగానాం కేవలం విషవర్థనం.

"పాములకుఁ బాలుపోసిన విషమగునట్లు మూర్ఖులకు మంచిమాటలు చెప్పినను గోపమునకుఁ గారణమగుఁ గాని శాంతిగలుగదు" అని యావృత్తాంత మంతయు జెప్పిమని ధర్మశీలుండగు నబ్బాలుండు "తల్లీ ! నీవూరడిల్లుము నేనించుక పెద్దవాఁడను గానిమ్ము. మాతాతరీతి నధికవిఖ్యాతి సంపాదించి సంతోషము గలుగఁ జేసెద" నని యూరడఁ బలికిన యాడింభకుని మాటల కాబోఁటి పరమానందముఁ బొందినది. మఱియు గీర్తికేతుండు శూన్యములగు భాండాగారముల గల్పవృక్షమును బ్రార్థించి నిస్తులకనకమణివస్తుపూరితములుగాఁ జేసికొని యందుఁ గాసైన బీరు పోనీయక బొక్కసములకు ముద్రలువై పించి యధిక పైసున్యవృత్తితో రాజ్యంబు సేయుచు -

సీ. అతివైభవాఢ్య దే . వాగారములను గ
             బ్బిలముల కునికిప • ట్టులుగఁ జేసె
    సతతభూసురసంఘ • సంకీర్ణసత్త్రమం
             దిరముల నెల్ల • నద్దియలకిచ్చె
    నవనీసురులు స్వేచ్ఛ • ననుభవించెడు నగ్ర
             హారంబులకుఁ గట్టె • నధికకరము
    నపరాధులను బోలె నర్ధుల బంధించి
             చెఱసాలఁ బెట్టించి • పరిభవించె

గీ. సప్తతంతుక్రియచార • సరణిమాన్పె
   వేదశాస్త్రాదివిద్యావి • వేశముడిపె
   దానధర్మము లను మాట . దప్పుఁ జేసెఁ
   గీర్తికేతుఁ డపఖ్యాతి • కేతుఁ డగుచు.

ధీరమతి యగు చారుమతి ప్రజల దైన్యోక్తుల విననోపక పరితపించుచు రహస్యముగా బొక్కసములనుండి రొక్కము సంగ్రహించి పాఠశాల కరుగునప్పుడు కుమారున కిచ్చి నిఱు పేదలకుఁ బంచిపెట్ట నియమించుచుండును. వితరణశీలుం డగు నబ్బాలుండును బ్రతిదినము గోటమాటున నిలిచి దీనులకా ధన మిచ్చుచుండును. దానం జేసి యారాజకుమారుండు బడికిఁ బోవుసమయ మరసి వేనవేలు దరిద్రులా ప్రవేశమున మూఁగికొని యుందురు. విజయభాస్కరుఁడు తల్లి తో జెప్పియు జెప్పకయు దోసిళ్ళకొలఁదిధనముదెచ్చి యర్దులకు విరజిమ్ముచుండుటఁజూచి విక్రమార్కునిఖ్యతి యితఁడే నిలుపఁ గలఁడని చూపఱులు గొనియాడుచుందురు. బోరులకుఁ జౌర్యంబునంబోలె గితవునకు జూదమున భాతిఁ జారునకుఁ గామ తంత్రంబునఁ జందమున నబ్బాలక శిఖామణికి గ్రమక్రమముగా వితరణగుణంబున