పుట:కాశీమజిలీకథలు -04.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

బోధింపవలదని చెప్పిన విని యప్పఁడతి చింతించుచు, వెండియు నిట్లనియె. నాథా : మనకు ధనము లేదని విచారింపవలదు. పెరటిలోఁ గల్పవృక్షమున్న మాట మీ రెఱింగినచో నిట్లనరుగదా : కోరినంత నాపాదపము వలసిన ద్రవ్యమిచ్చెడిని. మీకుమారుని తరముదాక నామ్రాకుఁ మనయిల్లువీడదు. మనసువచ్చినట్లు వ్యయముఁ జేసికొనవచ్చును. దేవతాతిథిపూజల మానిపింపనేల ? యని యడిగిన నాలుబ్ధుఁడు "ఓహో : నీ యూహమిదియా ? తెలిసినది. నీకన్నుల కదియొకటి నెఱసులాగున మెఱయుచున్నది. కాఁబోలు. పాప మాతెఱగంటిఱేఁడు మూఁడుతరములదాఁకా నామ్రాఁకు మనయింటనుండునట్లు వరమిచ్చెనుగాని కానిచో నామహానుభాఁడు దానిసైత మేబిచ్చగానికో యియ్యకపోవునా ? ఆవృక్షశాఖలవఱిచి పంచుమనియా నీయభిప్రాయము ? బాగు బాగు : అదియర్థుల కడుపునిండుటకు బ్రార్థింపఁదగినది కాదు. రాజ్యాంగవిషయమై పెద్దగా దానిఁ బ్రార్థింపవలసియున్నది. పోపొమ్ము ! రాజకార్యవిషయము లాఁడువాండ్ర కేమిటి"కని మందలించిన విని యమ్మించుబోఁడి ముక్కు పై వ్రేలిడుకొని వెఱఁగందుచు నిట్లనియె.

ఆహాహా : నీవా మహానుభావుని కెట్లు పుట్టితివోకదా ? నిన్న నవలసిన పనిలేదు. నీయట్టి యల్పబుద్ది నట్టివానికిం బుట్టించిన విరించిన దిట్టవలయును. నీ బానిసత్వము గ్రహింపక బుద్దిగఱపవచ్చిన నన్ను నేను నిందించుకొనుచుంటినని యేమోపలికి యందు నిలువక యక్కలికి లోపలికిం బోయినది. కిర్తికేతుండును దదీయవాక్యంబు లాలించి భజగమసంబు చందంబున రోజుచుఁ గంఠగతంబగు నహంకారముతో నామెమాటలు కేమియుఁ బ్రత్యుత్తరమీయక తన నివాసమున కరిగెను.

విజయభాస్కరునికథ


గీ॥ ధర్మముల యెక్క చారుసాం • చర్యరాశి
     సుగుణముల ప్రోగు శౌర్యతే • జోనిధాన
     మురుకళాస్పూర్తి విజయభా • స్కరుఁ డనంగఁ
     దనఱువాఁడు దదీయనం • దనుఁడు ఘనుఁడు.

పదియాఱేఁడులప్రాయముగల యబ్బాలుఁడు పాఠశాలనుండి యింటికివచ్చి మనోహరుని దుర్వ్యాపారమునకై యెద్దియో ధ్యానించుచున్న చారుమతిగాంచి "అమ్మా : నేను బ్రతిదినము బడినుండివచ్చువఱకు ముచ్చటగాఁ జూచుచుఁ జేతులు సాచి యెత్తుకొని ముద్దు పెట్టుకొనుదానవు. నేఁడు నాదెసఁజూడక చింతించుచుంటివేల ? కారణమేమని జేతులు -------- నడిగినఁ బుత్త్రుం గౌఁగిటంజేర్చుకొని యా సతీతిలకము "నాయనా ! నేనేమని చెప్పుదును. మీ తాత మిగుల విఖ్యాతుఁడు. అతని కడుపునం బుట్టి మీతండ్రి విపరీతక్రియాతంత్రుడయ్యెనని విచారింపుచుంటి.