పుట:కాశీమజిలీకథలు -04.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

18]

కీర్తికేతుని కథ

137

రాజ్యములో యాచించినవారి నపరాధులవలెఁ దండింపవలయును. అట్లయినయాచకులు లేకపోవుదురు. మా తండ్రి కోటులకొలఁది ధనమిచ్చియు మా రాజ్యము యాచక జన శూన్యముగాఁ జేయలేకపోయెను గదా : మీరు నా యానతి ననుసరించి --పటి నుండియుఁ గ్రొత్త శాసనముల దేశములోఁ బ్రకటింప వలయును. నా యాజ్ఞ మన్నింపని వాని నధికారము నుండి తొలగింతునని పలికి య నృపుం డంతఃపురమున కరిగెను.

సాధుమతులగు మంత్రులు తమ కిష్టము లేకున్నను రాజశాసన మా మఱు నాఁడే పట్టణములోఁ జాటింపజేసిరి. ఆ వార్త దాసీసముఖమున విని కీర్తి కేతుని పట్టమహిషి చారుమతి మిక్కిలి పరితపించుచు నొకనాఁడు రాత్రి సోపాలంభముగా మగని కిట్లనియె. ప్రాణేశ్వరా ! మీ తండ్రి సాహస వితరణాది గుణంబుల శివకర్ణదధీచాదుల సిగ్గు పరచుచుఁ ద్రిలోక విఖ్యాతమగు కీర్తిసంపాదించి నాకలోక మలంకరించిరి అమ్మహాత్ముని పేరు దలంచినంతనే మూర్ఖునకైన మైపులకింపక మానదు. అయ్యయ్యో ! అవదాన్యుఁడు వై చిన సత్రములన్నియుఁ గట్టిపెట్టించి దేవాలయముల మూయించియగ్ర హారములకుఁ బన్నులు గట్టించిరట. యెంత పాపము ! ఎంత మోసము ! దేవతాతిథిపూజలు సాగని రాజ్యము రాజ్యమా : కటకటా ! మీ బుద్ధి యింత విపరీతమైనదేమీ రాజ్యము మీ రొక్కరే చేసితిరా ? ఇంతకుఁ బూర్వ మెందరైరి. ఇఁకముం దెందరు గానై యున్నారు ? అట్టి యుత్తమునికి జనించిన మీయం దిట్టి నికృష్ట గుణంబులు సంక్రమించుటకుఁ గారణ మరయ వలసియున్నది వినుండు.


ఆ.. చంచల, పమ యౌవనం
మనం ఆలపే ): 0.4లం - సపమం జీవితం
చర్మం • సరికి నిశ్చలమతి స్వర్గారం దాటనం
పశ్చాత్తాపముతో బరాపయిత శోకాగ్ని నా దహ్యతే॥

సిరులు పాదరసమువంటివి. యౌవనము ప్రవాహవేగమైనది. జీవితము ధనమువల నాశనము నొందుచున్నది అని తెలిసికొని నాకద్వార కవాటములఁ బాటించు ధర్మమెవ్వఁడు చేయఁడో వాఁడు జరాపీడితుఁడయి పిమ్మట దుఃఖించునని పురాణములు ఘోషించుచున్నవి. ఈ సంసారము దీర్ఘస్వప్నమువంటిది. దీనినమ్ము పిత్రువార్జిత మగు యశమును గళంకపఱచెద రేమిటికి ? నా ప్రార్దనము మన్నించి ధర్మకార్యముల యధాగతముగా జరుగునట్లు నియమింపుడని వేఁడుకొనిన నతండిట్లనియె.

ఇంతీ ! నీ వేదాంతము నాస్వాంతమున కెక్కదు. మనము... - a . . . . వ్యయము సుమ ... " మన మంచిన, మా తం: సాయినది . : ఓం -3 ధనము సంపాదింపలేదు. నలు మరియు