పుట:కాశీమజిలీకథలు -04.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

విస్మయ మభినయించుచు నోహోహో ! మా తండ్రి యెంత యుక్తముగా రాజ్యము గావించెను. మీ మాటలు వినఁ జాల సంతోషము గలిగినది. దీనికంతయు మీమంత్ర బలమే సహాయ భూతమై యొప్పినది కాఁబోలు. దేశమే చిన్నదట దానిలో సగమగ్రహారములఁట. మిగిలిన సగము సత్రముల కంట. ఉన్న వారు మన్ను దినవలయు నంట చక్రవర్తి యని పేరంట మేలు మేలు, బాగు బాగు, సాధు సాధు. విక్రమార్కుఁడు మంచి యుక్తముగా రాజ్యముఁ జేసెను. మమ్ముల మంచి నిర్వాహకముఁ జేసెను. నిత్యము దలంచు కొనవలసినదే. బొక్కసములనే మైన రొక్కము మిగులు నేమో యని చావఁబోవు నప్పుడదియుం గడతేర్చి పోయెంగదా ? ఇకఁ గొడవయేమి ? ఛీ ! ఛీ ! యింత యవివేక మెందైనం గలదా ? యాగకుల స్తోత్ర పాఠములకుబ్బి సంసారము భ్రష్టముఁ జేసికొందురా ? బ్రహ్మవని పొగడినంతనే బ్రహ్మయయ్యెనా యేమి ? ప్రభుత్వము ధనమూలమై యున్నది. గ్రీష్మకాలంబున నల్పసరస్సులవలె ధనహీనుని ప్రయత్నము లన్నియు నశించును. ధనము లేనివాఁడేమి చేయఁగలడు? ఆదాయ మెఱిగి వ్యయము జేయవలయును. నీతి వాక్య మాయన చదివియుండలేదు కాఁబోలు. మీకైన బుద్ధిలేదా ? ఇసిరో యీ ధనహీన రాజ్యము నే నెట్లుపాలింతును. మా యధికార మర్దుల పొట్టలు విచ్చబెట్టుటకా ? యని క్రమముగా నభివృద్ధినొందు కినుకం గనుఁగనఁ గెంపుగదుర బలికిన విని బెదరుచు మంత్రు లిట్ల నిరి.

దేవా ! మే మేమి చేయుదుము. మీ జనంకుడు తానిచ్చుచుండ వలదనిన వానింబట్టి శిక్షించుచుండును. లుబ్ధజనులఁ దన రాజ్యములో నుండవలదని యాజ్ఞాపించెను. దానం జేసి యాయన ముందర నే మాటయుఁ జెప్పుటకు శక్యము గాదు. అదియునుం గాక ఆ పుణ్యాత్ముఁడు మన దేశములో ధనమెన్నఁడు స్వీకరింపలేదు. కోరినంతనే యాకాశము కాంచన వర్షము గురియుచుండును. ఆ దాత యెంత పంచి పెట్టినను గొడవలేక కావలసినంత విత్తము ప్రోగుపడినది. అతనికిఁ దైవ బలము గలిగి యున్నదని స్తుతించుటయుఁ బండ్లు పటపట గొఱుకుచు గీర్తికేతుం డిట్లనియె.

బాలికులారా ! మీ స్తుతివచనములు విరమింపుఁడు. నేను మా తండ్రివలే యాచకుల ముఖస్తుతి వచనముల కానందించను. అదృశ్యమైన యా ముష్మీకమునకై యైహిక సుఖముఁ జెడఁగొట్టుకొనుట నా దలంపుకాదు. ఏ వృత్తియుఁ గల్పించుకొనక దాన ధర్మములని బ్రాహ్మణులు ప్రజల బాధింపుచుందురు అగ్రహారముల కనియు, సత్రముల కనియు, దేవాలయముల కనియుఁ బేరులు చెప్పి దనము వాడి వాడుచుందురు. పుడమి వాండ్రకన్న వంచకులు లేరు. మా తండ్రి వట్టి వెఱ్ఱివాఁడు. వాండ్ర మాటల నమ్మి రాజ్యమంతయు శూన్యము గావించెను. ఇప్పుడు దానిని నేను మార్పు చేయ వలయును గదా. ఇటుపైన సత్రములన్నియు గట్టి పెట్టెంచిసామాన్యము విక్రయించవలయును. దేవజాతని సత్కారములు సాగింపకున్న మా ---------- గొడవలేదు. అగ్రహారముల కన్నిటికిఁ బూర్తిగాఁ బన్నులు గట్టవలయును. ఇక మన