పుట:కాశీమజిలీకథలు -04.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వారి కెఱింగించి యా చెఱఁదప్పించుకొని నిన్నుఁ జూడవలయునని నిన్న నిచ్చటికి వచ్చితిని. నన్ను రాజభటులు పట్టుకొని బందీగృహంబునం బెట్టరి.

నా వృత్తాంతము వైద్యులతో మొఱపెట్టుకొనగాఁ బిచ్చికుదిర్చితిమని నన్నిచటికి దీసికొని వచ్చినారు. ఇదియే నా వృత్తాంతము. పిమ్మట నాలోచించుకొనుమని తన కథనంతయుం జెప్పిన విని యా విదూషిమతల్లి యుల్లము ఝల్లుమన నల్లన యొకింత తడవు విచారించి యిట్లనియె. ప్రాణేశ్వరా! నిక్కము దెలిసింది. మీ తమ్ముఁడు మిమ్ము బోలియే యున్నవాఁడు కాఁబోలు. అతం డిక్కడికి వచ్చినం జూచి మీరనుకొని యిన్ని చిక్కులం బెట్టినారు. అతండు చెఱసాలనుండి తప్పించుకొని పారిపోయెను గాఁబోలు! ఆ వెంటనే మీరు వచ్చుటచే మిమ్మే యతఁడనుకొని బద్దుంజేసిరి. ఆహా! మీ తమ్ముఁ డెంత నిస్పృహుఁడోకదా? అయ్యో? తనయొద్ద పలికిన మాటలం దలఁచికొన సిగ్గగుచున్నది. మీరు క్రీడాంతరమునఁ జేసిన చేష్టల నెల్ల నుగ్గడించితిని. అన్నన్నా! యెంత ప్రమాదము దాటినది? అయ్యారే? మా తోడికోడలు సైతము మిమ్ముజూచి మోసపోయినదిగదా? కట్టా ? మీరిట్టులేక రూపముతో నుండుటబట్టికదా! యీ చిక్కులు మాకు వచ్చినవని పలుకుచు నారాత్రి యతనితోఁ గూడుకొని త్రుటిగా వెళ్ళించినది.

మఱునాఁ డుదయకాలంబుస నయ్యంబుజాక్షి తండ్రిని రప్పించికొని జనకా! మీయల్లునివృత్తాంతము వింటిరా? కడువిచిత్రమైనదిగదా? వీరిద్ద ఱన్నదమ్ములొక్కటియే పోలికగలిగి ప్రజలను మోసము చేయుచున్నారు. ఈయన తమ్ముఁడు కృష్ణుం డనువాఁడు చంద్రకాంత నగరంబునఁ గనకాంగదుఁ డిచ్చిన ప్రశ్నమున కుత్తరముఁజెప్పి యాయనకూతుఁరు సువర్ణలేఖం బెండ్లియాడుటకు నిశ్చయించుకొని యారాత్రియే యామెతోఁ గలిసికొని చెప్పకయే యెక్కడికో పోయెనట. అప్పర్వేందుముఖి గర్భిణియైనది. దానంజేసి సామంతరాజులందఱు తప్పుగా గణించి వెలివేసిరఁట. అంతలో మీయల్లుఁడు మనతోఁజెప్పక మార్గవశమున నక్కడి కరిగిరఁట. వీరింజూచి తమ యల్లుఁడనుకొని యారాజు మన్నించుచుఁ దనకూఁతు నంతఃపురమునకు బంపిరట. ఆ చిన్నది నావలెనే పరితపించుచు నెన్నియో మాటలాడినదఁట. ఏమియు వినిపించుకొనక నేను మీయల్లుడగానని పలుకుచు దప్పించుకొనివచ్చిరఁట. తరువాత నాఁడువ్రాసిన ప్రశ్నోత్తరముల వ్రాతంబట్టి కృష్ణుండని గుఱుఁతుపట్టి మీయల్లుడు వారిసందియము దీర్చెనఁట మనము వారివలనే మోసపోయితిమి వీరితమ్ముడు కృష్ణుం డిచ్చటికివచ్చిన మీయల్లుడే యనుకొని పెక్కు చిక్కులం బెట్టితిమి. వీరు మంచిగుణసంపత్తిగలవారు గనుక సరిపోయినది. లేకున్న నెంత ప్రమాదమో విచారించితి. కృష్ణుండు పారిపోయిన మఱునాడే యా నగరు చేరుటచే రాజభటులు పట్టుకొని చెఱసాలం బెట్టిరి. కాకతాలి న్యాయముగా నంతయుం