పుట:కాశీమజిలీకథలు -04.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుగుణసాగరుని కథ

115

తెలియదు. అది మొదలు మదనగ్రహంబు మదీయహృదయంబున నావేశించినది. అది స్వప్నమని విరక్తి జెందుదమన్నను మేమప్పుడు మార్చుకొనిన యుంగరము నాజవ్వనిది నావ్రేలనున్నది. దానంజేసి యసత్యముకాదని యా పైదలి చెయ్వులే తలంచుచుఁ జిలుక గూసిన నాకలికి పలుకుచున్నదని యదరుచు గానంబు వినిన దదీయ కంఠనాదంబని యులుకుచు నీ తెఱంగున మదోన్మాదమునఁ బ్రవర్తింపుచుఁ గర్తవ్యాంశ మెఱుఁగక యొకనాఁడు వేకువజామున లేచి యెవ్వరికి జెప్పకుండ నందుండి యొక దారింబడి యెక్కఁడికో పోవఁదొడంగితిని. నా సంకల్ప మేమియో తెలియదు. అంతలో సాయంకాలమైనది. కన్నుగానక యందుండువోలె నక్కాంతా కాంతరమున సంచరింపుచుండ నాదండనుండి కొండవలె భయంకరమైన రూపముగల యొక భూతము నా యొద్ధకువచ్చి సింగంబు సారంగశాబకమును బట్టులీల నన్నొడిసి పట్టినది. అప్పుడే నా ప్రాణములు పోయినవని తలంచితిని. స్మృతి దప్పినది. తరువాత నన్నది మ్రింగినదో చంపినదో యేమిచేసినదో నాకుఁ దెలియదు. నీ వలన నాయాపద దాటినది గాఁబోలు. నీ వెట్లు విడిపించితివో దెలియదు. తరువాత వృత్తాంతమునకు నీవే ప్రమాణము. ఆ కారణముగా నాకిట్టి యువకారము గావించిన మీ కులశీలనామంబులు విని యానందించుట నాకు ముఖ్యముగదా ! యని పలికి యూరకుండెను.

ఆ కథవిని సుభద్ర హృదయంబునఁ బుట్టిన సంతోషము పట్టజాలక యట్టె నిలువంబడి యొక్కింత సేపేమియుం దెలియక యాశ్చర్యమందుచు నంతలోఁ దెప్పిరిల్లి మోహముగప్పి యప్పుడేమియు మాటాడక తన స్వప్నంబునఁ గనంబడిన మనోహరుం డతండని నిశ్చయించి నిలువఁజాలక యతనిని మిత్రుండువోలె బిగ్గరఁ గౌగిలించుకొనినది. అతండును సుహృదాశ్లేషసౌఖ్యంబు ప్రకటింపుచు సుభద్రను మన్నించెను. పిమ్మట సుభద్ర మొదటికథ యేమియుంజెప్పక తానాయరణ్యములోఁ బ్రవేశించుటయు బ్రహ్మరాక్షసుఁడు తన్నుఁజంపబోవుటయు దానన్నమాటలు విని తనకు వరమిచ్చుటయు నా మందసము గోరి కొనుటయు లోనగు వృత్తాంతమంతయుం జెప్పినది.

సుగుణసాగరుం డావృత్తాంతమువిని మిక్కిలి యాశ్చర్యము నొందుచు మృత్యుముఖమునుండి తప్పించిన యతనియందుఁ గృతజ్ఞతగలిగి తన దేశమునకుఁ దీసికొనిపోయి యెక్కుడుగా గౌరవింపఁదలంచి సుభద్రతోఁగూడ స్వదేశాభిముఖుఁడై యరిగెను.

కృష్ణుని కథ

అది యట్లుండె. కృష్ణుం డానాఁడు సుభద్రను పిడిచి ముందరిగి కొంత సేపటికి సుభద్రమాట జ్ఞాపకము వచ్చుటచే మిక్కిలి పరితపించుచుఁ గొంతదూరము వెనుకకువచ్చి యాయడవి ప్రతిధ్వని యిచ్చునట్లఱచి యఱచి ప్రతివచనంబుఁగానక