పుట:కాశీమజిలీకథలు -04.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గీ. కటకటా ! మూర్ఖమర్కట • కరతలస్థ
    కల్పతరుసూనమాలికా • కల్పుఁడగుచు
    సరసుఁడగు మర్త్యుఁ డంగనా • జనమహోగ్ర
    ఘోరసంసార విషధిలోఁ • గూలనగునె.

తన్మూలకముగా మదీయాంతరంగము శృంగారరసతరంగితము కాదని నిశ్చయించి మా తండ్రియొక్క యుద్యానవనములోఁ గ్రీడాసౌధ మొండు మనోహరవస్తుసంపూరితముగాఁ గట్టించి యందు నన్ను నివసింపజేసెను. మఱియు వారాంగనానృత్యగానప్రసంగములచేతను శృంగారనాటకప్రదర్శనములచేతను గావ్యనాటకాలంకారగ్రంథపఠనవిశేషములచేతను గాలక్షేపము జరుగునట్లు నిత్యము నియమించెను. అప్పటికి నామనసు తిరిగినదికాదు. అందులఁ గుఱించి మా తండ్రి నిత్యముఁ జింతింపుచుండెను. ఇట్లుండు నా కొక స్వప్నము వచ్చినది. అబ్బా ! తలంచుకొనిన బాష్పంబులు గన్నుల నావరింపు చున్నవి చూడుము. ఆహా ! యొక మనోహరాంగి నా పర్యంకముదాపునకువచ్చి నిలువంబడినది. అంతలోఁ గన్నులం దెఱచిచూచితిని.

సీ. భుగభుగ వాసింప . బొసగు పుత్తడిబొమ్మ
              మాటాడనేర్చిన • మణిశలాక
    కలికిచేతలనొప్పు - కమ్మక్రొవ్విరిబంతి
              తగుజీవకళల చి • త్తరువుప్రతిమ
    గమనశృంగారంబు • గనుపట్టు లతకూన
              కళదొలంగని తొల . కరి మెఱుంగు
    కరచిణాంగసం • గతిఁగన్న శశిరేఖ
              హావభావములఁ జె • న్నలరు సరసి

గీ. యగునని గణింప వినుతింప * నలవిగాదు
    దాని చరలూబ్జనఖలేఖ * తోను బోలఁ
    గలరె యీ లోకముననున్న * కాంతలెల్ల
    చెన్నుమీఱఁగనేమని * విన్నవింతు.

క. అమృదులోకు విలాసం
   బామోహనముఖవికాస మాదరహాసం
   జూపెద యానడ యాజడ
   యామేని మెఱుంగురంగు • నలవియె పొగడన్.

అక్కామినీరత్నమును శయ్యపై కొయ్యన జేర్చి మోము ముద్దాడి యధర సుధారసంబు గ్రోలంగ సుకించుచున్న సమయంబున ధటఢ్చటారావముతో విస్ఫులింగము లురులఁ దరులచాదుల భస్మము చేయుచు నొక యగ్నిజ్వాలవచ్చి మమ్మెగరఁ జిమ్మినది. ఆ యలజడి వలన నాకు మెలకువ వచ్చినది. ఆ చిన్నది యేమయ్యనో