పుట:కాశీమజిలీకథలు -04.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పిరి పరోపకారముకన్నఁ బుణ్యకారము మఱియొకటి లేదు. నేనొరులకు నేమి చేయగలను. వేగముగ నా మేను భక్షించి నన్ను స్వర్గమున కనుపుడు మీకును జాల పుణ్యము వచ్చునని పలికిన విని యా బ్రహ్మరాక్షస్సు అల్లన నవ్వుచు నిట్లనియె.

పువ్వుఁబోడి ! మేమెట్టి క్రూరాత్ముల మైనను మాకు మాత్రము కనికరము లేదను కుంటివా ? నిన్నుఁజూడ నా కేమియో కాని యక్కటికము జనించుచున్నది. నీ యాయువు దృఢమైనది గదా ? నీవు నా నిమిత్త మీ యరణ్యమునకు వచ్చితివి కావున బూజ్యురాలవైతివి. నిన్ను భక్షించుటకు వీలు లేదు.

శ్లో॥ మహతామపియజ్ఞానాం కాలేనక్షీయతే ఫలం
     ఫలస్యాభయదానస్య క్షయఏవనవిద్యతే ॥

అని యున్నది. కావున నీ కభయ మిచ్చితిమి. నీ కామిత మెద్దియో చెప్పుము. తీర్పవలసి యున్నదని పలికిన విని యవ్వనిత డెందము తట తట యొక్కింత తగ్గించుకొని క్రమ్మఱ నిట్ల నియె. స్వామీ ! నాకీ దేహము మీఁద నాస లేదు. నాకు మరణమే శ్రేయము కనికరించి నన్ను భక్షింపుఁడు దీని వలన మీకుఁ బుణ్యముగాని పాపము లేదు. ఇదియే మీ కతిథి కృత్యమని యెంతయో నై పుణ్యముగాఁ బలికిన నా రక్కసుఁడు సమ్మతింపక అయ్యో ? నీ వింత వెఱ్ఱిదానవేమి బ్రతికి యుండిన సౌఖ్యములఁ నొందవచ్చును. చచ్చిన నేమియున్నది. నెమ్మది నెమ్మదిగా విచారించుకొని కామితము దెలుపుము. ప్రీతితో నిచ్చుచున్నానని పలికి యా చెట్టుపైకిఁ బోయెను. పిమ్మట నయ్యువతి యాత్మగతంబున నిట్లు తలంచెను. ఆహా ! ఎందును స్తుతించిన నుబ్బనివారు లేరు. ఎదుటి మనసు కని పెట్టి మాటాడిన నెట్టివారికి నక్కటికము గలుగక మానదు. మసుష్య రక్తమును బానకమువలెఁ గ్రోలు నీదావునకు నా మాటలచే నక్కటికము గలిగినది. సమయస్ఫూర్తిగా నన్నిట్టి మాటలాడించినవాఁడు భగవంతుఁడు గాక మఱియెవ్వఁడు. దైవమాయ దెలియ నెవ్వరితరము. నా కింక నాయుశ్శేష మున్నది కాఁబోలు. కానిమ్ము. మఱికొంత సేపు వీని యొద్ద వైరాగ్యవృత్తి సూచించి పిమ్మట వర మడిగెదను. నాకు వీని వలనగు కార్యమేమి యున్నది. ఈయరణ్యము దాటించుటయే వరము అని తలంచునంతలో నా పాదప్రాంతము నుండి తదీయ పరిచారకు లిరువురు వారిలో వారు మాటలాడుకొనుచుఁ గ్రిందికి వచ్చి యచ్చిగురుఁబోడి కిట్లనిరి.

కాంతా ! నీ వృత్తాంతమంతయు మా యేలిక మాకుఁ జెప్పెను. మేమాతని దూతలము. ఈతండు విష్ణు రాక్షసుఁడు, నేను శివరాక్షసుడ. నీ కాయన వరము నిచ్చెదను కోరికొమ్మని యడిగిన మరణమే వేడు చున్న దాన వఁట యిదియేమి కర్మము చెరుకు ముక్కలవలె మనుష్య గాత్రముల విఱుచుకొని తినియెడు మా స్వామికి నీయం దక్కటికము గలుగుటయే మిక్కిలి చిత్రముగా నున్నది. మనుష్యమాంసమునకై మమ్ము నిత్యము వేచుకొని తినుచున్నాడు. నీ పూర్వపుణ్యము మంచిది యెక్కుడు