పుట:కాశీమజిలీకథలు -04.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14]

పాతాళబిలము కథ

105

ముద్దాడుచుఁ దద్దియు మోహంబున నుద్దవిడి గౌఁగిలింపఁబోయి బోఁటీ! ఇవి యేటి వేడుకలు! వీని మత్తు వదలించి మేల్కొనఁజేయుము. కాలయాపన సైపనని పలికిన నా సునంద వేఱొక మందుఁజల్లి యతనికిఁ దెలివి గలుగఁజేసినది. అప్పుడతండు కన్నులం దెఱచి నలుమూలల జూచి తన శయ్యయుఁ దనటెంకియుఁ గాదని తెలిసికొని కాచదీపికిలచేఁ బట్టపగలుగా నొప్పుచున్న యా శుద్ధాంతమందిర విశేషములన్నియుం జూచి యది స్వప్నముగా దలంచి అయ్యో నా కిట్టి కలలు వచ్చుచున్నవేమి ? వీని వలన దుఃఖమే కాని సుఖము లేశములేదు. పోనిమ్ము మొన్నటి పొన్నికొమ్మ యొకసారి వచ్చి నా కన్నులం బడిన నీ కల సార్థకమగుంగదా ? యని తలంచుచుండ నా సువర్ణలేఖ సువర్ణలేఖంబోలె మెఱయుచు దివ్యమాల్యాంబరాభరణాదుల ధరించి జగన్మోహనంబగు వేషంబుతో మైపూతవాసనలు దెసల నావరింప నల్లనవచ్చి యతనిం గౌఁగిలించుకొనినది.

అతం డాసుందరి గుఱుతుపట్టి మోహనసాగరంబున మునుంగుచు నోహోహో ! నీవా ప్రవాహవేగంబునఁ గొట్టికొని యెక్కడికిఁ బోయితివి ? నన్ను విరహాగ్ని పాల్పడఁజేసి యింత యుపేక్షసేయ న్యాయమేనాయని యేమేమో యున్మత్తాలాపములు పలికిన విని యక్కలికియుఁ బ్రాణేశ్వరా ! పిమ్మట నేమి జరిగినదో నే నిప్పుడు జెప్పఁజాలను. దైవ మెట్లు పంచిన నట్లు జేయువారము కదా ! మనకు స్వతంత్ర మెక్కడిది మరల మనము గలసినందులకే సంతోషింపఁ దగిన దని ప్రత్యుత్తర మిచ్చినది. పిమ్మట నా రాజనందనుం డయ్యిందువదన సంగీతప్రసంగమునఁ గొంతతడపు సంతసము గలుగఁజేయుటయు మోహావివశుండై యగ్గరితం బిగ్గరఁ గౌఁగిలించుకొని యధరామృతంబు గ్రోలెను.

అట్లు వారిరువురు మనమునం గల యభిలాషలు దీర స్మరపారవశ్యంబున సమబాహ్యాభ్యంతర విశేషంబులఁ గ్రీడించి యలసి సొలసి గాఢ నిద్రావశం వదులగుటయు నంతలోఁ దెల్లవాఱు సమయ మగుచున్నది. కావున సునంద యతని నెప్పటి యట్ల దీసికొని పోయి మునుపింటిలోఁ బరుండఁబెట్టి వచ్చినది. కృష్ణుండు వాడుక ప్రకారము సూర్యోదయము కాకమున్న లేచి రాత్రి చర్చలన్నియు స్వప్నలబ్దములని నిశ్చయించి సంతోష విషాదవిస్మయంబులు చిత్తంబుత్తల పెట్టఁదన యవయవములు చందన కస్తూరికాది పరిమళ ద్రవ్యమిళితములై ఘుమఘుమాయ మానంబులగుచుండ సత్యాసత్యవివేచనము సేయనేరక కలకఁ జెందుచు సుభద్రం జేరి యిట్లనియె.

చెల్లీ ! వింతలపై వింతలు గనంబడుచున్నవి. మొన్నటి చిన్నది రాత్రి స్వప్నములో వచ్చి ముచ్చటలు సూపినది సుమా ! నా మేని గంధము పరికింపుము. -------------- ఎన్నఁడు గనివిని యెఱుంగము. నేను బెండ్లి యాడఁ దలఁచుకొన్నా ఆచిన్నది వచ్చినది సుమా ! మనమికిం దుండరాదు. మన దారిని మనము బోవుదము. --------------- ఇందుకేమేని యీ రాజు పెండ్లి జేయక విడువడు. రహస్య మార్గం