పుట:కాశీమజిలీకథలు -02.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కాశీమజిలీకథలు - రెండవభాగము

బోవు డిది అందికొనక దేవా! నేనీసభ బహుమతుల నొందుటకుఁ జేసినదికాదు. నాకు ధన మవసరము లేదు. మీవంటి మహాత్ముల అనుగ్రహము గలిగినంజాలునని సవినయముగా బ్రార్ధించినది. దానిమృదుమధురోక్తులకు సంతసించుచు నందుల కభయహస్త మిచ్చి యాఱేఁడు పరివారముతోఁగూడ నరిగెను.

తిలోత్తమ కథ

శూరసేనుండింటికిబోయిన కొంతతడవునకు రాజభటులు కొందరు వచ్చి చంద్రలేఖం జూచి బోటీ! నిన్ను జూడవలయునని రాజపుత్రిక తిలోత్తమ మిగుల వేడుకపడుచున్నదట? మాఱేడుఁ నిన్ను దీసికొని రమ్మని చెప్పెను. వెంటనే రావలయు ననుటయు నది తనకోరిక లీడేరినవికాదా అని సంతోషించుచు జక్కగా నలంకరించుకొని తన పరిచారిక పూబోడితోగూడ రాజభటులవెంట నగరిలోనికిం బోయినది. అందు అంగజాలలచే జూపింపబడిన మార్గంబున దిలోత్తమ యంతఃపురమునకు బోవుటయు నక్కన్యకాతిలకంబు చంద్రలేఖ నుచితమర్యాదలతో దోడితేదగు పరిచారికల నియమించినది. వారు చేయు సత్కారములకు మిక్కిలి సంతసించుచు నవ్వేశ్యాతిలకము తిలోత్తమను జూచిన తోడనే నమస్కారమును జేసినది.

రాజపుత్రికయు దీవించి దానిగాత్రసౌకుమార్యమునకు నద్భుతమందుచు నోహో! యిట్టి యుత్కృష్టవిద్యారూపంబులు గల గలకంఠి నుత్తమకులంబున బుట్ట జేయని పరమేష్టి నిందాపాత్రుడు. ఇదియుం గులపరిపాటిపాటింపక యుత్తమస్త్రీ లక్షణంబుల కనుగుణంబులను సుగుణముల నొప్పారుటచే మిగుల గొనియాడదగియున్నది. దీనితో గొంత ముచ్చటించి మరియుం దీనిస్వభావ మెరిగెదగాక యని తలంచి అల్లన దానితోనిట్లనియె. ఇంతీ? నీవు నిన్నటిసభలోఁ జేసిన వింతపనులు వినినంత నాకు మిగుల సంతసమైనది. నీ కులంబున కెల్ల గౌరవమును సంపాదించితివి. మేలుమేలు, నీవిద్యోప దేశకులెవ్వరు? ఏమి విద్యలభ్యసించితివి! విద్యలు సాంగములైనవియా? అనురూపవరునిం బడయక యిట్టి లేప్రాయమంతయు వృధాఁ జేయుచున్న దానవేమి? ఇది యొక్కటియే నాచిత్తమ్మున కుమ్మలికము గలిగింపు చున్నదని పెక్కుగతుల అమ్మదవతిని నుతియించినది.

తన్ను రాజపుత్రిచేసిన పొగడ్తల సహింపమి నభినయించుచు జంద్రలేఖ భర్తౄదారికా! నేను చదివినది యొక్కరియొద్ద కాదు. కావ్యనాటకాలంకారగ్రంథము లొకరియొద్దను, వ్యాకరణ మొకరియొద్దను, తర్కము వేఱొకరియొద్దను, గీతశాస్త్ర మొకరియొద్దను జదివితిని. ఇట్లే “పుష్కలేన ధనేనవా" అనురీతిని