పుట:కాశీమజిలీకథలు -02.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుచికుని కథ

101

జెప్పుడు. మీకు నేనే బహుమతి నిప్పింతునని చెప్పితిని. నామాటలకు వారు వెరఁగడుచు మాకింతకంటె నేమియుఁ దెలియదని చెప్పిరి. మఱియు నిందెవ్వరికేనిం దెలియునేమోయని పురమంతయుఁ గ్రుమ్మరుచుంటిని. ఇవియే యిచ్చటనున్న విశేషములు నీ వొకసారి వచ్చితివేనిఁ దిలోత్తమతో మాటలాడనగును. అచిన్నదియు మిగులపాండిత్యము గలదగుటచే నీతో మైత్రి సేయకమానదు. తక్కిన విశేషములన్నియుఁ దిలోత్తమవలన నీకుఁ దెలియఁబడును. అనియున్న యుత్తరమునుఁ బలుమారు చదువుకొని గౌతముని బుద్ధినైపుణ్యమునకు మెచ్చుకొనుచు చంద్రలేఖ రామచంద్రనగరమునకుఁ బోవుట యుచితమే అని తలంచి యాప్తులకేరికిం దెలియకుండ నొకనాఁటిరాత్రి పూవుఁబోని మాత్రము వెంటఁబెట్టుకొని ప్రచ్ఛన్నంబుగా నిల్లువెడలి రామచంద్రనగరంబునకుఁ బోవు తెరవు తెరంగంతయు గౌతముం డుత్తరములో వ్రాసియున్నవాఁడు కావున నట్టి మార్గమునంబడి చంద్రలేఖ స్వల్పకాలములోనే యా పట్టణము చేరినది.

అందొకయింట బసఁజేసి రెండుమూఁడు దినములు గౌతముని వెదకినదికాని అతండు గనంబడలేదు. తరువాత నానాతి దేవాలయములోనికిఁబోయి అందున్నపటము జూచి ముద్దుఁబెట్టుకొనుచుఁ గొంతసేపు సంతాపముజెందినది. పిమ్మట నప్పరిచారికచే దెలుపంబడి మోహమునువిడిచి అచ్చటినుండి మరల బసలోనికివచ్చి ఆచిత్రపటమునుగురించి పెక్కు తెరంగుల నాలోచించుచుండెను. రాజపుత్రిక అగు తిలోత్తమతో మైత్రిఁజేసినఁ నాడుగాని దీనివృత్తాంతము దెలియదనియుఁ దన విద్యామహిమంజూపినగాని యట్టిపని నెరవేరదనియు నిశ్చయించి, మరునాడు తానొక విద్యావినోదసభఁ జేయుననియు నందుఁ దన్ను జయించినవారికిఁ గానుకలిత్తుననియు నీయూరిలోనున్న విద్వాంసులును ప్రజలును రావలయుననియు బ్రకటనపత్రికలు వ్రాసియంపినది.

ఆవీటిలో మేటులగువార లాపత్రికల నంతగా మన్నింపక యా సభకుఁ బోవలేదు సామాన్యజనులు పోయి యమ్ముదిత చేసిన అమానుషంబులగు విద్యావినోదంబులఁజూచి మెచ్చుకొని ఆమ్మరునాఁడు తత్ప్రభావమంతయుఁ జాటింపదొడంగిరి. మఱి రెండుదినములు జరిగిన వెనుక నత్తెరవ మరలనొక సభఁజేయుదునని పూర్వము వలెనే పత్రికలంపినది. అప్పుడాయూరిలోనున్న పెద్దమనుష్యులు ధనికులు విద్వాంసులు లోనగు వారందరు నాసభకువచ్చిరి. భూపతియు దానికీర్తి పౌరుల వలన విని యున్నవాఁడు కావునఁ దానుకూడఁ బండితులతో నాసదస్సునకుఁబోయెను.

పిమ్మట నాయూరిలోని విద్వాంసులు దానితోఁ బ్రసంగముచేయ బూనిరి గాని యొకటిరెండుప్రశ్నములలోనే వారలఁ బరాజయంబు నొందించినది. అందుల కందరు వెరఁగందుచుండ వెండియు నద్భుతములైన విశేషంబులు సహస్రావధానము వ్యస్తాక్షరీ నిషేధాక్షరీ విచిత్రబంధకవిత్వాది వినోదములచే సభ్యులహృదయంబుల కాహ్లాదంబు గలుగఁజేసినది. అప్పు డప్పూవుఁబోడిని సరస్వతియొక్క యపరావతారమని స్తోత్రములు సేయఁ దొడంగిరి. సభ ముగించిన తరువాత నాచేత పారితోషికమియ్య