పుట:కాశీమజిలీకథలు -02.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కాశీమజిలీకథలు - రెండవభాగము

మంచిపుణ్యము రాఁగలదని బోధించినఁ గన్నీరుఁగార్చుచు నా గణికామణి జరిగిన యథార్థ మంతయు వానికి జెప్పి విచారింపదొడంగినది.

గౌతముఁ డాబోటిమాటలు విని వెఱఁగుపడి యాతోటలో సంచారవృక్షము లున్నవేమోయని శంకించెను. పిమ్మటఁ జంద్రలేఖ గౌతమా! యీదోషము నేనుగట్టి కొంటిని. బలదేవునితో నీకుమారుని వెదకి తెప్పింతునని చెప్పుము. నిక్క మతనినే నేనుఁ బతిగా వరించితి నన్నిగతుల నా కాతనికంటె జీవనోపాయములేదు. నీకుఁ గావలసినంత ద్రవ్యమిచ్చెద. దేశాటనముచేసి అతనిజాడఁ దెలిసికొనిరమ్ము. ఎప్పటికప్పుడు నాకు విశేషవార్తల దెలుపుచుండుము. అతండు నీకునుఁ బరమాప్తుడు గదాఁయని ప్రార్ధించిన సంతసించుచు నప్పుడే కొంతద్రవ్యము గైకొని బలదేవునికిఁ జెప్పి యిల్లువెడలి రుచికుని వెదకుచుఁ గొన్నిదినములు దేశసంచారము గావించెను.

మఱికొన్నిదినము లఱిగిన వెనుక గౌతమునొద్దనుండి చంద్రలేఖ కొక యుత్తరము వచ్చినది. అందు చంద్రలేఖా! నేను బెక్కుదేశములు దిరిగితినికాని యెందును రుచికునిజాడ తెలిసిదినకాదు. ఇప్పుడు సముద్రప్రాంతమందున్న రామచంద్రనగరంబునకు వచ్చితిని. ఇందు బరిశీలింప నొకవిశేషము గనంబడినది వినుము. ఈపట్టణంబు శూరసేనుడను రాజు పాలింపుచున్న వాడు. ఇతనికి దిలోత్తమయను కూతురు కలదు. ఆ చిన్నది విద్యారూపగుణశీలంబుల అసామాన్యయైయున్నది. ఎట్టి రాచపట్టివచ్చినను మెచ్చక దివ్యప్రభావసంపన్నుడగు వానినిగాని బెండ్లియాడనని నీమముచేసికొని యున్నదఁట మఱియుం దండ్రి బలవంతముసేయఁ గొన్ని దినంబుల క్రింద నొకసుందరపురుషుని యాకృతిం జిత్రఫలకమునవ్రాసి యిట్టివానిందెచ్చినఁ బెండ్లియాడుదు. లేకున్న నాతో మఱిచెప్పవలదని చెప్పినదఁట ఆధాత్రీపతియు నా చిత్రఫలకం బాయూరిలోనున్న యొకదేవాలయంబులోఁ వ్రేలగట్టించి అట్టిపురుషునిం దెచ్చినవారికిఁ బారితోషిక మిత్తునని ప్రకటనవ్రాసియున్నవాఁడు. నేనును నాగుడిలోనికి బోయి యాపటంబును చూచితిని మన రుచికుని యాకృతియే యందున్నది. దానింజూచిన నామిత్రుని చూచినట్లేయున్నది. కొంతసే పట నిలచి నాకన్నుల కరవుదీరఁ బ్రత్యవయవంబుఁ బరికించితిని ఇంతయేని భేదము గనబడలేదు. అచ్చద్దినట్లే యున్నది. అచ్చట నున్న వారిని దానివృత్తాంతమడిగినఁ బైనవ్రాసిన ప్రకారమే చెప్పిరి.

మన రుచికుఁ డాతిలోత్తమ హృద్గతుఁడగుటకుఁ గారణమేమో తెలియదు. నేనాతిలోత్తమ నడుగుదమన్నను శుద్ధాంతచారిణియగు నక్కాంతారత్నము నెటుల చూడనగును. అప్పఁడతియు నిప్పు డెద్దియో విచారముజేఁ గుందుచున్నదఁట. నేనచ్చట నున్న ప్రకటనలనుఁ జదువుచుండగా రాజభటులువచ్చి యిందున్నవాని నెఱుఁగుదువా యేమి యిట్టివానిం దీసికొనివత్తువేని నీకు మంచిబహుమతి నిప్పింతుననుటయు నేనిట్లంటి. అయ్యో! నిందున్నవాఁడు నామిత్రుడు వాని వెదుకుటకే నేను వచ్చితిని. వాఁడు కనఁబడినఁజాలును. ఇంతకన్న బహుమతి నా కక్కరలేదు. ఇంతకన్న మీకేమైనం తెలిసిన