పుట:కాశీమజిలీకథలు -02.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుచికుని కథ

97

ఆ ప్రసంగమంతయును విని రుచికుడు మురియుచు గౌతమా! మాలికల మూలమున నాకు మంచివాడుకయే వచ్చినది. నేనిప్పుడీ లోపలికిబోయి నాపేరు జెప్పిన జంద్రలేఖ నన్ను మిక్కిలి గౌరవపరచును కాబోలు పోయియాపని దానికి నేర్పుదునా అని అడిగిన అతండు నవ్వుచు జాలుచాలు మనమింటికిబోవుదము రమ్ము నిన్ను గానక నీతండ్రి పరితపించుచుండును. నీవు లోపలికి బోతివేని తిరిగివత్తువా? అని మందలించెను. అప్పుడు రుచికుడు వయస్యా! ఎట్లైయినను మాతండ్రి మందలింపక మానడు అయిన యాలస్యమైనదిగా మఱికొంత సేపిందుండి వింతలంజూచి పోవుదమని బ్రతిమాలిన అతండు మరికొంతసేపు నిలిచి మఱల రమ్మని నిర్బంధించెను. కాని పోవుటకు రుచికునికి గాళ్ళుసాగినవికావు. అప్పుడు గౌతముడు గోపము చేయుచు గానిమ్ము ఇంత ప్రొద్దుపోయినదికదా రాకుంటివి నేనుబోయి మీతండ్రిం దీసికొనివత్తు నని అవ్వలికి బోయెను. అంతలోఁ బరిచారిక దండలు తెచ్చినదేమోయని పూవుబోణి మరల వాకిటకు వచ్చినది. ఆసమయము గ్రహించి రుచికుడు పదతీ! నీవు రుచికుడు గట్టిన దండల నిమిత్తము విమర్శింపుచుంటిని. అవి నాయొద్దనున్నవి కాని కొంచెము నలిగినవి చూచుకొమ్మని పలుకుచు అక్కలికి యొద్దకుఁబోయి యా మాలికలం జూపెను.

అచ్చెల్వ వానిం బుచ్చుకొని విమర్శించిచూచి యివి రుచికుడు కట్టినవే. నలిగినను రమ్యముగానే యున్నవి. వీని నెంత కమ్మెదవని అడిగిన మీరు నిత్యము నెంతకు గొనుచున్నారో అంతియే నీవెల యని చెప్పెను. అది మాకు దెలియదు. నీ వీదండల నెచ్చట గొంటివి లాభమేమి కావలయును అడిగిన అతండు నవ్వుచు నేనివి యొరులయొద్ద గొనలేదు. స్వయముగానే కట్టితిని. కావున నీయిష్టము వచ్చినంత సొమ్మిమ్మని అడిగిన అవ్వెలది నీపేరేమని యడిగినది. అప్పుడతండు నా పేరు రుచికుడని చెప్పెను.

ఆమాటవిని యాబోటివిస్మయ నభినయించుచు నేమేమీ! దండలుగట్టెడు రుచికుడవు నీవేనా? మీయి ల్లెక్కడ. ఎప్పుడుఁ గనంబడితివి కావేమి? నీదండలకు మాసఖురాలు మిక్కిలి వేడుకపడు చుండును. ఆపని నీయొద్ద నేర్చుకొనవలయునని నిన్ను దీసికొనిరమ్మని పలుమారు నాతో జెప్పినది. నీయునికిపట్టు నాకు దెలిసినదికాదు. లోపలికి బోవుదమురమ్మని పలుకుచు దీపము వెలుగున వాని చక్కదనముజూచి తల యూచుచు నక్కజపాటుతో నాబోటివానిని లోపలికి దీసికొనిపోయి అమ్మా! రుచికుడు. రుచికుడని నీవు పలుమారు స్మరించుచుందువు. వాని నిదిగో! నీయొద్ద దీసికొని వచ్చితిని జూడుమని పలికిన విని యబ్బురముఁజెందుచు జేరలకు మీరిన కన్నులును దళ్కు బెళ్కులును, దీర్ఘబాహువులును సుందరముఖంబునుం గలిగి లేతయౌవనమునఁ బొలు