పుట:కాశీమజిలీకథలు -02.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీకథలు - రెండవభాగము

దుఃఖ మనుభవించుటకా? యని చింతింపుచు నంతలో గన్నులు దెరచి యెదురనున్న యింద్రద్యుమ్నునిం జూచి గురుతుపట్టి యింతింతనరాని సంతోషముతో నతనిం గౌగలించుకొన్నది.

అతం డాచేడియ తనభార్యయని తెలిసికొని దైవసంఘటమునకు వెరగుపడుచు నోహో! ఇందుముఖీ! మనకీ సంయోగము గలుగుటకు భగవంతుని యనుగ్రహముగాక వేరొకటికాదు. ఈ దారు వాధారముగా జూపి మనల రక్షించిన యద్దయామయుని బెక్కు తెరంగుల వినుతింపదగినదిగదా? ఈ దారువే భగవంతుడని తలంపుము. దీనియాధారమున మనము తీరము జేరుదుమని యూహించెదను. నాకట్టి శకునము లగుచున్నవి మనకు క్షుత్పిపాసలు లేవుగదా? కానిమ్ము. ఎన్ని దినములకైన దీరము జేరకపోదుమాయని పలుకుచు నాదారువునందు భగవద్బుద్ది నిలిపి మనఃకుసుమములచే నర్చింపుచుండెను.

అట్లు రెండుమూడు దినములు గడిచినంత నొకనాటి యుదయమునకా దారువు వారినొకతీరమున జేర్చినది. ఉదయమున లేచి చూచువరకు భూమిగనంబడి నంత వారియానందమేమి చెప్పుదును. భూమి భూమి యని కేకలువైచి యింద్రద్యుమ్నుడు భార్యకు దెలుపుచు నాదారువు దీరధారుణిం జేరినది. కావున సులభముగా నతండు భార్యతోగూడ నొడ్డెక్కెను పిమ్మట వారా పారావారమును గన్నులారజూచి గుండెలు బాదుకొనుచు వా రనుభవించిన కస్తి యంతయు దలంచుకొని యాచందనదారువే తమ్ము రక్షించెను గావున దైవమని తలంచి మొక్కి దానిని నున్నతస్థితికిదే దలచి కర్తవ్యమరయుచు దానిని విడిచిపోలేక యాదేశనామము సైతము గురుతెరంగరు గనుక యచ్చటనే తిరుగ జొచ్చిరి.

అంతలో నాప్రాంతమున నొక సేనానివేశము సందడి వినంబడినది. దానిం బారజూచి ధారుణిభర్త యచ్చటికిబోయి యాదేశ మెద్దియో తెలిసికొనవలయునని తలంచి భార్యతోగూడ మెల్లన నా సేనానివేశమునకుబోయెను. పటకుటీరవారముచే గ్రామము వలె గనంబడినది. దానిదావునకుబోయి యందొకనింజేరి యీ సేనానివేశ మెవ్వరిది? యీ దేశము పేరేమి? యిది యేసంవత్సరము తిథివారనక్షత్రము లెట్టివో తెలుపుమని అడిగెను.

వా డతని మాటలు విని వెరగుపడి యోహో! నీప్రశ్న మిగుల వింతగా నున్నదే! తిథివారనక్షత్రములు చెప్పుటకు నేను పంచాంగపు బ్రాహ్మణుడ సనుకొంటివాయేమి? నీ కామాత్రము తెలియదా? సంవత్సరము పేరు సైతము మరచితివా? బాగుబాగు! అని పరిహాసమాడుచు నిది యోఢ్రదేశము యీసేనానివేశ మింద్రద్యుమ్నమహారాజు కుమారుడు విజయునిది. అతండు తండ్రిని వెదకుచు దైవజ్ఞునిమాట ననుసరించి మూడుదినములక్రిందట నిచ్చటికివచ్చెను. ఇది చిత్రభానుసంవత్సరము. నే