పుట:కాశీమజిలీకథలు -02.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీకథలు - రెండవభాగము

శ్లో॥ సుఖస్యదుఃఖస్యనకోపిదాతా పరోదదాతీతికుబుద్ధిరేషా
     అహంకరోమీతివృధాభిమానః స్మకర్మసూత్రగ్రధితోహిజంతుః

          అనియుండగా యెట్లుతప్పును ? దాననేకాదా మనపెద్దలు,

శ్లో॥ అలంహర్ష విషాదాభ్యాం శుభాశుభఫలోదయె
      విధాత్రానిహితం యద్యత్తపలంఘ్యం సురాసురైః॥

శభమునకు సంతసమును అశుభమునకు విచారము నెన్నడును బొందగూడదు. బ్రహ్మపిహితమైనది సురాసురులైనను దాటజాలరు. మనుష్యుడెప్పుడును సుఖదుఃఖములలో బొరలుచునేయుండును. సుఖదుఃఖములనుండియే శరీరము పుట్టినది. సుఖానంతరము దుఃఖము, దుఃఖానంతరము సుఖము దినరాత్రులవలె జంతువులకు నియమితముగా వచ్చుచుండును. మరియు సుఖములో దుఃఖము, దుఃఖములో సుఖమును గలిగియున్నవి. కాబట్టి విద్వాంసులు ఆపత్తుల జలింపకుండ వలయును. సర్వమును మాయ యని ఎరింగినచో మోహమేల గలుగును? అది ఎరుంగక సంసారపంకనిమగ్నులై పశువులవలె జరించినచో మూఢత్వము దట్టమై యురక యిడుమలం గుడిపించును ఇదియునుంగాక,

శ్లో॥ పాధానామివవర్త్మని క్షితిరుహాంనద్యామివభ్రశ్యతాం
     మేఘనామివపుష్క రేజలధౌసాయాంత్రికాణామివ
     సంయోగః పితృమాతృబంధుతనయ భ్రాతృప్రియాణామహో
     సిద్దోదూరవియోగ ఏవ విదుషాం కాతత్రచింతాభవేత్

మార్గంబున బాటసారులు, నదులయందు దారువులు, గగనమున మేఘములు, సముద్రమున నావికులును గలిసి విడిపోవునటుల తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తలు లోనగువారు గలసికొనిపోవుచుందురు. అట్టి వియోగము లెప్పటికైనను దప్పనివే దీనికై విచారింపనేల? కావున మన మిప్పుడీ సముద్రమునంబడి మునిగిపోవుదుమను విచారమింతయేని స్వాంతమునం దగులనీయకుము. మనమిది వరకు బడిన యిడుముల కన్న నిది పెద్దదియా? వానిని దాటించిన భగవంతుడిప్పుడు లేడా? మనకిందు చాపు విహితమైనచో నెట్లును దప్పదు. సుఖమున కాసబడినప్పుడు గదా దుఃఖము గలుగుచున్నది. అట్టియాశయే వదలుకొనినచో నెట్టిసుఖమున్నదో బరీక్షింపుము. దీనికి నీవు వగవకుము. లెమ్ము సముద్రమునంబడుటకు సిద్ధముగా నుండుము. సముద్ర మన నెద్దియనుకొంటివి? మనల రక్షించుచున్న నారాయణమూర్తి శయనగృహము.

అని డగ్గుత్తికతో బలుకుచున్న యాఱేని నీతివాక్యములచే దేరి యానారీశిరోమణి చింతవిడచి ధైర్యముతో భగవంతుని ధ్యానించుచుండెను. ఇంతలో నాసరదారుడు చెప్పినప్రకారము గాలి క్రమక్రమముగా నతిశయించుచు జివరకు నాయోడ