పుట:కాశీమజిలీకథలు -02.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీకథలు - రెండవభాగము

మూటలోనుండగా జూచితిననియుం జెప్పెను. ఈవృద్ధబ్రాహ్మణుడు చక్కని స్త్రీ యీపూవు నిచ్చెనని చెప్పుచున్నాడు. ఈవిషయములో గొంచె మాలోచించవలసి యున్నది అని చెప్పుచు నా బ్రహ్మచారిం బిలిచి అయ్యా! నీకు ఫలమిచ్చిన పురుషుని పోలిక యెట్లున్నదో చెప్పగలవా యని యడిగెను.

ఆ బ్రహ్మచారి యప్పుడు కనుచీకటిగా నుండుటచే నిదానముగా బరిశీలింప లేదు. పురుషుడనుకొంటినేకాని యదియు నిశ్చయముగా జెప్పలేను. మూటవిప్పినప్పుడు పయ్యెద చెంగులాగున గనంబడినది గుర్రమెక్కివచ్చెను గావున బురుషుడని చెప్పు చుంటిని. గుర్రము మాత్రము పంచకళ్యాణి రంగుగలది. అని చెప్పగా మరల చండవర్మ యిట్లనియె.

ఆ ఫలమును పుష్పమును నిచ్చిన మచ్చెకంటి యొక్కరీతియే. ఆమె దేవకన్య గాని మనుష్యస్త్రీ గాదు. దేవతలు భూలోకములో విలాసార్థము విహరింతురను వాడుక కలదు. ఈఫలపుష్పములు రెండును దేవలోకములోనివే. యెద్దియోకారణముచేత నానాతి వీనిందీసి కొనిపోవుచుండగా నడుమ వీరిదైన్యమువిని దయాబుద్ధితో నిచ్చినది. దేవతలు కృపాస్వభావులు గదా? ఇంతకంటె మరియొకటికాదు. ఈ బ్రహ్మచారి గురుతుపట్టజాలక పురుషడని చెప్పెను. వీరి పూర్వపుణ్యవశంబున అద్దేవికి దయ బుట్టినది. వీరి దురదృష్టవశమున బరుల చేతంబడినవి. కాని దాతృత్వమహత్వమునం బట్టి దాగినవికావు. ఇవి రాజార్హమయిన వస్తువులు. సామాన్యులకడ నుండదగవు. వీని నిత్యము బూజించుచుండవలయును. ఈబ్రాహ్మణుల కిరువురకు దగు బహుమతు లియ్యదగినది. ఇదియే నాకుదోచిన యబిప్రాయము. యింతకన్న బుద్ధిమంతుల కెద్ది యేని దోచిన వక్కాణింపనగునని పలికిన నాసభ్యులందరు నారాజు మాటలే యదార్ధము లనియు సహేతుకములనియు గర్తవ్యములనియు నేక వాక్యము గా బలికిరి.

ఇట్లు కొంతసేపా ఫలపుష్పముల గురించి యుపన్యాసము జరిగినపిమ్మట సభావినోదార్ధము సంగీతము బాడుటకై మణిమంజరి కాజ్ఞయిచ్చిరి. అప్పుడు మణిమంజరి హాయిగా వీణ బుచ్చుకొని పాడి సభ్యులకు సంతోషము గలుగజేసినది.

సాధారణముగా గానవిద్యాభ్యాసముగలవారికి బరులు పాడునపుడు తమకు గూడ బాడవలయునని నుత్సాహము గలుగుట సహజమైయుండును. అప్పుడు నాకు వీణవతిచేసిన స్వరకల్పనలన్నియు మనంబున గురుతుగా నున్నందున వాని పాడవలయునని యొకవెర్రి యానందము గలిగినది. మణిమంజరి పాట ముగించినతోడనే నేను సభాముఖమునకు బోయి అగ్రాసనాధిపతితో అయ్యా ! నాకును గానవిద్యాపాటవము కొంచెము గలిగియున్నది. ముహూర్తమాత్రము మదీయగాంధర్వవిశేషము గూడ నవధరించి నన్ను గృతార్దుని జేయబ్రార్ధించుచున్నవాడ అనుజ్జయిత్తురేయని వేడుకొనిన ఆతండు సమ్మతించి నాకొక వీణ నిప్పించెను.

అప్పుడు మిగుల సంతోషముతో నేనావీణ బుచ్చుకొని సారెల జక్కగా