పుట:కాశీమజిలీకథలు -02.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతపుష్పము కథ

75

గాని పదిదినములు విచారించినంత వారిద్దరు మిత్రులనియు మమ్ము బోషించు విషయములో నిరువురు సవరించుచున్నారనియుం దెలిసికొంటిని. వారిరువురకు నొక్కతెయే విటకత్తెకలదు. దానిమూలముననే వారికట్లు మైత్రిగలిగెను.

ఆవృత్తాంతమంతయు నాకు మరి పదిదినములకు వెల్లడియైనది. ఇట్లీ యధమవృత్తిగలవారి కీప్రసూన మిచ్చితినే యని పశ్చాత్తాపము జెందుచుంటిని. ఇట్లుండునంత మరిపదిదినములకు నావిటకత్తియ మూలముననే వారిరువురకు విరోధము పుట్టి క్రమక్రమంబున బలసి తుదకు వారికి ముఖావలోకనములు లేకపోయినవి.

శ్లో॥ అవజ్ఞాస్పుటితంప్రేమ యేకీకర్తుంక ఈశ్వరః।
     సంధింనయాతిస్ఫుటితం లాక్షాలేపేనమౌక్తికం॥

బద్ధలైన ముత్తెము లత్తుకచే నత్తుకొననట్లు సమానముచేత విడిపోయిన స్నేహము మరల గూడికొనదు. ఒకనిమిషమైనను విడువక యేకదేహముగా వర్తించు వారిరువురును కాంతామూలమున శత్రువులైన తిరస్కారవాక్యములచే రోషము బెంచుకొని యొకనాటిరాత్రి దొమ్మియుద్ధములో నొకరిచేత నొకరు చంపబడిరి.

పిమ్మట మమ్ము బోషించువారు లేక యాపూవు విషయమై వారి ఇండ్లలో వెదకి యెందునుంగానక చింతించుచు జివరకా విటకత్తియ యింటిలో నుండుట విని దానియొద్దకుబోయి యాపుష్పమును గురించి జరిగిన శపథముల తెరంగెరింగించి యిమ్మని యడిగితిని. ఆలంజతొత్తు ఇది నాసొత్తయినది. అవసరమున్నయెడల వారి దాయాదులమీద ఋణముగట్టి అధికారులతో జెప్పుకొనుము. పొమ్మని నన్ను దిరస్కరించి పలికినది.

అప్పు డాసంగతి నేను గ్రామాధికారులతో జెప్పితిని. వారు దానిని రప్పించి యడుగగా నాయొద్ద జెప్పినట్లే వారియొద్దను బింకముగా జెప్పినది. వారును కర్తవ్యమెద్దియో తెలియక చింతించుచుండిరి. ఇంతలో మాదేశప్రభువగు చండవర్మ మహారాజుగా రిచ్చట సభకు వచ్చుచు నాదినమున మాగ్రామములో బసజేసిరి. కావున నాసంగతులన్నియు వారికి దెలియజేసితిని.

"రత్నహారీతుపాధిన్‌వః" అని యున్నదిగదా! శ్రేష్టమైన వస్తువుల విషయమై రాజులు అభిలాష వహింతురు. చండవర్మ మహారాజుగారు పైసంగతులన్నియు దరువాత విచారించెదగాక యని యాపూవు పుచ్చుకొని మమ్ముగూడ రమ్మని చెప్పి యీసభకు వచ్చిరి. ఇదియే దీనివృత్తాంతమని చెప్పి యాబ్రాహ్మణుడు గూర్చుండెను. అప్పుడు సభ్యులందరు మఱల గరతాళధ్వనులచే నాసభామంటపమంతయు మ్రోగింపజేసిరి. అంతట చండవర్మ మహారాజు లేచి సామాజికుల కిట్లనియె.

అయ్యా! ఈఫలపుష్పాగమములరీతి మనమందరము వినియుంటిమి గదా! బ్రహ్మచారి తనకీఫల మిచ్చినవాడు పురుషు డనియు నప్పు డీపువ్వు వాని