పుట:కాశీమజిలీకథలు -02.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాశీమజిలీకథలు - రెండవభాగము

    పార్థివోత్తముల సంపచ్చైలముల గూల్ప
             భూసురధనము దంభోళిధార
    జగతీవరులకీర్తిచంద్రిక మాయింప
             సూర్యోదయము ధరాసురుల సొమ్ము

గీ. విప్రతితిసొమ్ము కంటెను విషము మేలు
    గరళమునకును బ్రతికృతి గలదు గాని
    దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
    గాన బ్రాహ్మస్వరములు గొంట గాదు జగతి.

అని భాగవతంబున జెప్పబడియున్న నీతి యేంతప్పును. పిమ్మట నాభటులు పటురయంబున నక్కుబేరదత్తు నానృపసత్తము నొద్దకు దీసికొనివచ్చిరి. ఇచ్చటను మొదట బెక్కు పోకలంబోయెను. గాని రాజదండన భయంబున జివరకు నిజముజెప్పి యాఫలమున్న మందసము గూడ దొంగలెత్తుకొని పోయిరని విన్నవించుకొనియెను.

తర్వాత నీభూతలపతి యతిప్రయత్నముతో నెట్లో వెదికించి తుదకు నీ ఫలమును బట్టికొనెను. ఇంతియ నేనెరింగినది యని యాబ్రహ్మచారి యుపన్యసించి తర్వాత తన పీఠముమీద గూర్చుండెను. అప్పుడందరు గరతాళములు వాయించిరి.

అటుపిమ్మట నందున్న కుబేరదత్తుడులేచి సభకు మ్రొక్కుచు అయ్యా! యీ భీమశర్మ చెప్పినదంతయు నిక్కువము. నేను ధనలోభమున బ్రాహ్మణుని మోసము జేసినందులకు మంచి ప్రాయశ్చిత్తమైనది. క్రొత్తకాసైన నింటిలోలేదు సర్వస్వము చోరులు కొల్లబెట్టిరి. నిందల పాల్పడితిని. ఇకనెప్పుడు నిట్టిపనులు చేయకుండ బుద్ధివచ్చునట్లందరిలో నపరాధము జెప్పుకొనుచున్నవాడనని లెంపలు వాయించుకొని కూర్చుండెను.

తరువాత రాజు నానతి రెక్కలుగట్టి తీసికొని రాబడిన తస్కరులిట్లనిరి. అయ్యలారా ! దైవప్రేరితమైన బుద్ధిచే మేమా కుబేరదత్తునిల్లు గొల్లబెట్టి యాపెట్టెలన్నియు నీయూరనే వాడుక ప్రకారము నిపుణికుడను కంసాలియింటికి దీసికొనిపోయితిమి. ఆ స్వర్ణకారుడు మాయెదుటనే యిన్ని పెట్టెలు విడదీసి యందున్న సరుకులన్నియు జూపించెను.

తుదకొక పెట్టెలో నీ ఫలమున్నది. దీని పరిమళమునకు వెఱగంది యిట్టి ఫల మీ శెట్టి ఎచ్చటనుండి తెచ్చునోయని పలుతెరంగుల చింతించితిమి. తరువాత మేమా ధనమంతయు బంచుకొనుచు నీ ఫలమును నిపుణికుడు కోరినందున వాని కిచ్చితిమి. అతండేమి చేసెనో మేమెఱుగము. ఇదియే మాకు తెలిసినది యని చెప్పిరి. పిమ్మట నా కంసాలి అయ్యా ! నేనాఫల సువాసనకు వెఱగపడి యాదొంగలను కోరి దీనిం బుచ్చుకొంటి రెండుమూడు దినములు నాయొద్దనే దాచి యిట్టి యద్భుతఫలము