పుట:కాశీమజిలీకథలు -02.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతఫలము కథ

71

నాడు. నా కియ్యవలసినసొ మ్మియ్యకున్నాడు. చూచితిరా పెద్దమనుష్యలని యాప్రాంతమం దున్నవారితో జెప్పి తగవుపెట్టితిని. అచ్చటి పెద్దమనుష్యులు వచ్చి యాకోమటితో నీబ్రాహ్మణుడు తన ఫలము హరించి యిచ్చెదనన్న సొమ్మిచ్చితివి కావని తగవుపెట్టుచున్నాడు. దీనికి నీ వేమి చెప్పెదవని అడిగిరి.

అప్పుడా కుబేరదత్తుడు వారితో అయ్యా! ఈ బ్రాహ్మణుడు పదిదినముల క్రిందట నడవిపండెద్దియో మూటగట్టుకొని యీదారిం బోవుచుండెను. అత్తరి నేనది యేమిఅని అడిగితిని. ఈపారుడిది యద్భుతమైన ఫలమని నాతో డాంబికపుమాటలు కొన్ని చెప్పెను. ఆమాటలు యథార్థమని యెంతకిత్తువని అడిగితిని. ఆయన దురాశగా జెప్పెను. నేనుదానికి దగినట్టు పరిహాసముగానే మాటలాడితిని పిమ్మట నీ యిష్టమువచ్చి నంత యిమ్మని సమ్మతిపడెను.

వల్లెయని నేనాఫలము దినగా జేదుగానున్నది రుచియేమియు గనంబడలేదు. పైన వికారముగానున్నది. పిచ్చి యెత్తునేమోఅని వెరచుచున్నవాడ. ఇట్టిస్థితిలోవచ్చి మేము పండుతినిన సంగతి తెలిసికొని దానికి లక్షరూపాయలు గావలయునని నిర్బంధించు చున్నాడు. ఎక్కడనైన నొకఫలము లక్షరూకల వెల జేయునేమో మీరే చెప్పుడు. అయినను బ్రాహ్మణుడుగదా! ఫలముమాటకేమి? నాకు ఫలమైన నుండదాయని పది రూపాయ లియ్యబోయిన బుచ్చుకొనక యూరక పిచ్చికేకలు వైచుచున్నవాడు. ఇట్టి దరిద్రుని నాచెంతకు బిలుచుట నాదేతప్పుఅని యుక్తయుక్తముగా వారితో జెప్పెను.

వాండ్రందరు వాని మాటనమ్మి ఎట్టిఫలమైనను లక్షరూపాయల వెలిజేయదని పలుకుచు నెదురునన్నే బూటకమువానిగా దలంచి మిక్కిలి మందలించిరి. అంత నేను చింతాకులస్వాంతుడనయి యేమియు జేయునది లేక ఎవ్వరితో జెప్పినను నమ్మకుండుటచే చివరికిది నా దురదృష్టమని తలంచుచు గలంకపడి రెండుమూడుపవాసములతో నీధర్మాంగదమహారాజుగారి యొద్దకు వచ్చి చెప్పుకొంటిని.

ధర్మప్రభువగు నీ మహారాజు నామొర నాలించి యాక్షణమందే యాకుబేరదత్తుని తీసికొనిరండని తనదూతలనంపెను. ఆ క్రిందటిరాత్రియే వాని యిల్లంతయు దొంగలు కొల్ల బెట్టి యింటిలోనున్న ధనమంతయు బెట్టెలతో గూడ నెత్తుకొనిపోవుటచే వీధిలోబడి గుండెలు బాదుకొనుచు కుబేరదత్తుం డేడ్చుచుండెను.

సీ. నరనాథ కులకాననముల దహింపంగ
             నవనీసురులవిత్త మగ్నికీల
    జననాయకుల నిజైశ్వర్యాబ్దు లింకింప
             బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు