పుట:కాశీమజిలీకథలు -02.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఫలపుష్పములు రెండును వ్రేలగట్టిరి. వానిపరిమళ మాసభ్యులకు నాసాపర్వము గావించుచున్నది.

అందు మండలాకృతిగా నమరింపబడియున్న సింహాసనముల మహారాజులు గూర్చుండిరి. రెండవశ్రేణియందు దరతరముగా నధికారులు కూర్చుండిరి. యొకదెస పండితులు నొకదెస గాయకులు మొదలగువారు సభ నలంకరించిరి.

అట్టిసభలో నే నొకమూల పీఠముపై గూర్చుండి వారు చేయబోవు నుపన్యాసమునకు చెవియొగ్గి యుంటిని. ఇంతలో నగ్రాసనాధిపతి యానతింబూని యాగ్రామ ప్రభువైన ధర్మాంగదమహారాజుగారు నిలువంబడి యెల్లరు విన దెల్లముగా నిట్లనిరి.

ఆర్యులారా! లోకాతీతమగు వస్తువెద్దియేని సంప్రాప్తిమగు నప్పు డద్దానివిశేష మెల్లరకు దెలియజేయుట రాజధర్మము. ఈ యద్భుతఫలమాహాత్మ్యము నేను జెప్పకయే మీకు దెలియబడు చున్నయదిగదా! ఈ పుష్పము సైతము పరిమళమును నీఫలవృక్షసంజాతమైనట్లే తోచుచున్నది. ఇది యెన్నిదినములున్నను వాడక యీరీతినే యుండును. నేను పదిదినములనుండి చూచుచున్నాను. ఇంచుకయైనకాంతి దప్పలేదు. ఇట్టిమహిమ కల్పవృక్షసంజాతములకుగాక మరియొకవానికి గలుగదు. ఈఫలమును దినుట వలన కలుగులాభ మెట్టిదియో యెవ్వరికిని దెలియదు. ఎద్దియో విశేషములుండకపోదని నేను రూఢముగా జెప్పగలను. అయినను నివి మాయొద్దకు పెక్కంతరముల నుండి వచ్చినవి. వచ్చినవిధమంతయు నాయాయీజనులచేత మీకు దెలియజేయుంచెదను. బుద్ధిమంతులగు మీరును తరువాత వీని పూర్వోత్తరములను గురించి యాలోచింతురు గాకయని పలుకుచు నా ఫలపుష్పముల సంగతి గురుతెరిగిన మనుష్యులముందర నంతకుమున్నే యప్పటికి రప్పించియున్నవాడు గావున వారికెల్ల మీకు దెలిసినసంగతులు యదార్ధముగా గ్రమము దప్పక జెప్పుడని యాజ్ఞాపించెను. అందు ముందుగా భీమశర్మయను బ్రహ్మచారి లేచి సభ్యులకు నమస్కరింపుచు నిట్లనియె.

అద్భుతఫలము కథ

సభాసదులారా! నా కాపురము విజయపురియను నగ్రహారము. నాపేరు భీమశర్మ యందురు. నేనొకనాఁటి సాయంకాలమున మాయన్న చేసిన యవమానము సహింపలేక చావవలయునను తాత్పర్యముతో మాయూరిప్రాంతమందున్న యడవికి బోయి యందు మెడకురి దగిలించుకొని బిగించుకొనుసమయములో నెవ్వడో యొకపురుషుడు పంచకళ్యాణిగుర్ర మెక్కి యాదారింబోవుచు నాయుద్యమము చూచి తటాలున గుర్రము దిగివచ్చి నాచేయి బట్టికొని యిట్టిసాహసము జేయ గారణమేమియని యడిగి