పుట:కాశీమజిలీకథలు -02.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీకథలు - రెండవభాగము

సంతోషించుచు నాకట్టి యుపాయము దోపించి యా యాపద, దాటించినవాడు భగవంతుడేయని తలంచి అతనిని మిక్కిలి స్తుతిజేసితిని.

నే నట్లుచేయనిచో నన్ను దప్పక నాకొండదేవతకు బలియిత్తురు. వాండ్ర కౄరకృత్యములన్నియు నాయాడువాండ్ర సంభాషణలో నాకు దేటపడినవి. పాపమా కోయదియే నన్ను గొండదేవతగా నిరూపించినది. ఇంతకు దైవమిట్లు శుభము గూర్పు దలచియుండ మఱియొకరీతి నెట్లుజరుగును. అట్లు వడిగా బోవుచు నొకనాడు సాయంకాలమున కొకయూరు చేరితిని. నాడు శివరాత్రి యగుటచే బెక్కండ్రుజనులు కోటీశ్వరమను పేరుగల యాక్షేత్రమునకు వచ్చిరి.

ఆక్షేత్రాధినాయకుండగు కోటీశ్వరునిమహిమ పురాణప్రసిద్ధమగుట దూరదేశములనుండి వేలకొలది జనులు వచ్చుటచే అచ్చట మిగుల సమ్మర్దముగానున్నది. అప్పుడు నాగుర్రమును దూరముగా విడిచి నేను స్నానముచేసి రాత్రివేళ నాగుడిలోనికి బోయితిని. ఆ యాలయములో నొకతరుణి నాకెదురుపడినది దా నెచ్చటనో చూచినట్లుండి పరిశీలింపుచుండగా నత్తలోదరి నన్నుజూచి ఏమమ్మా! నన్ను సాభిప్రాయముగా జూచుచున్నావు. ఎక్కడనైనా జూచిన జ్ఞాపకమున్నదా యని నవ్వుచు నడిగినది.

అప్పుడు నేను అవును. నిన్నెక్కడనో చూచినట్లేయున్నది. అదియే తలచుకొనుచున్నానని చెప్పితిని. పిమ్మట నమ్మదవతియు జ్ఞాపకమురాలేదా? అల్లనా డుద్యానవనములో విశాలాక్షి గుడి ముఖమంటపముమీద నేను వీణబాడుచుండగా నీవచ్చటికి రాలేదా? గానావసానమందు నీతో గొంత ముచ్చటింతమనుకొనునంతలో నీవు నిద్రపోయితివి. పిమ్మట నాకు గనంబడితివికావు. ఇప్పుడైన జ్ఞాపకమువచ్చినదా యని అడిగినది.

అప్పుడు నేనక్కజమందుచు నేమేమీ! ఇది కడువింతగానున్నదే. ఈకలకంఠిని గలలోగంటి. నదినిజమెట్లగును? కలలోగన్న పదార్ధము మేల్కొనినయప్పుడు కనంబడుట వింతకాదా? ఒకవేళ నది కలగాదేమో నిజమే. ఫలపుష్పములసంగతి ఎట్టిదో నిదియునట్టిదే! యీమాయ దెలిసికొన నెవ్వరికి శక్యముగాదు. నాజన్మావధిలో నిట్టి వింతల గని యెఱుంగనని తలయూచుచు నామెతో నమ్మా! జ్ఞాపకమువచ్చినదని పలికితిని. మరల నాకాంత కొమ్మా! నీవత్తోటనుండి యొకఫలము పూవును దెచ్చితివి. వానిమహిమ నీకు దెలియునా ? భద్రముగా దాచుకొంటివాయని యడిగినది. అమ్మా! నాకు వానిమహిమ దెలియదు. ఇరువుర బ్రాహ్మణుల దైన్యము చూడలేక వారి కిచ్చితి నని చెప్పితిని.

అప్పుడక్కలికి ముక్కుమీద వ్రేలిడికొని ఎంతపనిచేసితివి? అమ్మవారు నీకై వాని నిచ్చెంగదా! అట్టివస్తువుల మఱియొకరికి నియ్యవచ్చునా యని పలుకుచు గానిమ్ము, దైవకృపగలిగిన నవి ఎక్కడికి బోవునని పలికినది. నేను బిమ్మట నవ్వన