పుట:కాశీమజిలీకథలు -02.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోయపల్లె కథ

65

ఒకతె - ఓసీ ! ఈయేడు మనకొండదేవత మంచిరూపముతో పచ్చించి సుమీ! అమ్మోరువెంట్రుక లెంతపొడవుగా నున్నవో చూచితివా ?

మరియొకతె - ఔను. మొన్నను మాదొర కలలో నిట్లావత్తునని చెప్పినదట! ఈభేమ్మాండములన్నియు చేసేదేవతకు తలవెంట్రుకలు పొడుగుగానుండుట యేమియాశ్చర్యము.

ఇంకొకతె - ఓసీ. మనయమ్మవారు ఎంతమంచిబట్ట గట్టుకొనినదో చూచితివా? ఈమెకు మగ డున్నాడా?

వేరొకతె - ఓసీ. అయ్యో! ఈమెకుమాత్రము మగ డుండడా! ఈమె మగనిపేరు పోతురాజు. పిల్లలుమాత్రము లేరట.

మరియొకతె - మనమందరము యీమెపిల్లలముకామా? ఈమె కృపలేక పోయిన నిక్కడుండగలమా? మనలను బుట్టించినదే ఈమె.

ఇంకొకతె - ఓసీ. నే నెరిగిన తరువాత మనకొండదేవత యిట్టిరూపముతో రాలేదుసుమీ!

వేరొకతె - అవును. నిరుడు పులిరూపమున వచ్చి తెల్లవారకముందే వెళ్ళిపోయినది. ఆ వెనుకటేడు చిరుతపులిగా వచ్చినది. అప్పుడును దెల్లవారకముందే వెళ్ళిపోయినది.

ఇంకొకతె – నే డీయమ్మవా రెంతసేపుండునో ?

వేరొకతె - ఓసీ! తెల్లవారుదనుక నుండి పిమ్మట వెళ్ళునని తలంచెదను ఈయేడు మాత్ర మెక్కువగా నిలుచునా?

ఇంకొకతె — ఓసీ ! అమ్మవారిదేహము బంగారములాగే యున్నది. రెండు దినములుండినం జూచుచుందుముగదా?

అని యిట్లాడువాండ్రు సంభాషించుకొను మాటలన్నియు వింటిని. మహారాజా ! ఆసంగతి దలంచుకొనిన నిప్పుడు సైతము నాకు నవ్వువచ్చుచున్నది అట్లు తెల్లవారువరకు గ్రామదేవతవలె వారిచే నర్చింపబడి తెల్లతెల్లవారుచున్న సమయంబు నాగద్దెనుండి లేచితిని.

అప్పు డందరు అమ్మోరు వెళ్ళుచున్నదని కేకలుపెట్టుచు గ్రామదేవతను సాగనంపునటుల నావెంబడి రాదొడంగిరి. నాగుర్రమున్న చోటికిబోయి దానినెక్కి అందరు వెనుకకు బొండని సంజ్ఞచేయుచు గుర్రమును మునుపువచ్చినదారికి దోలితిని. వాండ్రందరు కొంతవరకు వెనుకనువచ్చి నాకు దండములు పెట్టుచు నాగుర్రముతో బరుగెత్తలేక క్రమక్రమముగా వెనుకకుబోయిరి. నేనును యమపురి దాటివచ్చినట్లు