పుట:కాశీమజిలీకథలు -02.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీకథలు - రెండవభాగము

నది. మొదట నమ్మదవతి యుపచారములు సేయుదానివలె నటించి క్రమంబున దన చతురవిలోకన సంభాషణాది విలాసములచేత నామనం బనంగాయత్తంబు గావించినది.

అప్పుడు సురుచి సంగమముమాట జ్ఞాపకమువచ్చిన బుద్ధితెచ్చుకొని వస్తునిరూపణ చేయుచుండ నీశ్లోకము స్మరణకు వచ్చినది.

శ్లో॥ కాంతేత్యుత్పలలోచనేతి విపులశ్రోణీభరేత్యున్నమ
     త్పీనోత్తుంగపయోధరేతి సుముఖాంభోజేతి సుభ్రూరిని
     దృష్ట్యామాద్యతిమోదతేభిరమతెప్రస్తౌతి విద్యానపి
     ప్రత్యక్షాశుచిభస్త్రికాంస్త్రియమహోకామస్యదుశ్చేష్టితం

క్రొత్తవాడనని యించుకయు గొంకులేక పెక్కుపోకలం బోవునమ్మత్తకాశిని తత్తరమువారించుచు నించుబోడి మేమింద్రియంబుల జయించినవారము నీవిలాసములు మాకుల్లాసము గావింపనేరవు. నీవిందుండిన లాభమేమియులేదు. పోపొమ్ము. మీమగవారు జూచిన మోసమువచ్చును ఉత్తమస్త్రీలకిది ధర్మముకాదని మందలించిన జలించిన డెందముతో నమ్మందయాన మందయానమున దానువచ్చిన త్రోవంబోయినది పిమ్మట నేను శయ్యయందు బరుండి యుదయంబునలేచి చూచువరకు బాదములకు సంకెళులు దగిలించి యొక బందీగృహంబున బద్దుడనై యుంటిని. నాయవస్థ యంతయు నీవుసైత మనుభవించినదే. మఱియు జెప్పనేల. నేటిప్రొద్దున నేమిటికో యీ పాతాళగృహంబునకుదెచ్చిరి. ఇందు మీదర్శనలాభము కలిగినది ఆపదలయందును శుభములు గలుగునని చెప్పిన పెద్దలమాటలు యదార్ధములని నమ్మవచ్చును. మిమ్ము జూచుటచే నాపడిన యిడుములన్నియు మఱచితిని. ధన్యుడనైతిని. ఇదియే నావృత్తాంతమని పలుకుచు నత డూరకుండెను.

అతని వృత్తాంతమంతయును విని యీ యింద్రద్యుమ్నుడు మిగుల వెఱగుపడుచు నతనిం గౌగలించుకొని యోహో! మిత్రమా ! విశాలాక్షి యిప్పుడు నిన్ను జూచిన నెంతసంతోషించునో గదా! ఆపూబోడికి నీవు తగినవాడవగుదువు. దానంజేసియే నీపెండ్లియైనపిమ్మట చింతించుచున్న యాచిన్నదాని స్వప్నములో నీవు చింతింపకుము. నీకు మేలయ్యెడినని యమ్మవారు చెప్పినది. అద్దేవిపలుకు పోలి బోవునా? ఈయిడుములు సైతముదాటి యాబోటితో గలిసికొనగలవని నాకు దోచుచున్నది. ఇప్పటికి దీనిని దాటుపాటవమెద్దియుం దోచకున్నది. కానిమ్ము. ఈయిక్కట్టు తెచ్చిపెట్టిన దైవమే దీనిని మరలించును. నా ప్రతిన నెరవేర మీయిరుపు రెన్నడు గలిసికొందురో యని పలుకుచు నతనిశోకమును శాంతిపఱచుచున్న సమయంబున వారిమాటలన్నియు వినుచున్న యొకపురుషుడు వినమ్రుడై యారాజున కిట్లనియె.

దేవా! నేను దేవరదాసుడను వీరుడనువాడ, మీ సంవాదమునంతయు విని యుంటిని. మిమ్ము నాయేలికయైన యింద్రద్యుమ్నునిగా దెలిసికొంటిని. మీవంటివా రిట్టి కట్టునం బడియుండుట లోకం బిట్టటగుటకని తోచుచున్నది. అగ్ని నొడిగట్టిన