పుట:కాశీమజిలీకథలు -02.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

45

రింపుచు నవ్వుచు సాభిప్రాయముగా జూచుచు నింటిలో నేపనిచేయుచున్నను నాయందే బుద్ధినిల్పికొని యీరీతిని కొన్ని దినములు గడిపినది. మరికొన్ని దినములు సిగ్గువిడిచి ఎవ్వ రేమన్నను సరేయని పలుమారు నేను బోధించుచున్నను వినక నెల్లరకు దెల్లమగు నటుల నాతో సంభాషింపదొడగినది. నేనును దానికి బోధించుటయే కాని మన్మథవికారములకు బెక్కింటికి బాత్రుడనైతిని. ఆహా !

శ్లో॥ సప్రత్యచాయదుర్లభ నిషేధవిషయోషియోషితాంవిషయః
     కామస్యభావపాతః ప్రసరతితత్రైవదుర్నివారః॥

శ్లో॥ ప్రభవతిమనసివినేకొ విదుషామపిశాస్త్ర సంభవస్త్సావత్
     నివతంతి దృష్టివిశిఖా యావన్నేందీనరాక్షిణాం॥

అను శ్లోకముల బఠించుచు వానింజెప్పిన వారిని బొగడుచు వివేక మింతైనను లేక స్మరపిశాచగ్రస్తుండనై యుక్తాయుక్తముల నెఱుంగక సంచరింపదొడంగితిని. చోరత్వము జరిగిన యారుమాసములకును, జారత్వమిక నారుమాసములకు జరుగుననునప్పుడే వెల్లడియౌనను వాడుకగలదుగదా? మాచర్యలు మరునాటి నుండియు నిరుగుపొరుగువారు చెప్పుకొనదొడంగిరి. కాని యది మేమెఱుగక గూఢముగానే యున్నదని తలంచుచుంటిమి మరికొన్ని దినములు జరిగిన వెనుక తుదకు మా ఎదుటనే పరిహాసము చేయదొడంగిరి. ఒకనాడు నా స్నేహితుడొకడు రహస్యముగా నన్ను బిలిచి మదనా నీనడత ఏమియు లెస్సగా నుండలేదు. నిన్ను ప్రజలు మిక్కిలి నిందించుచున్నారు. నీవు పండితుడవయ్యు నిట్టికొరమాలిన పలుకులకు దొడంగరాదు. పరకాంతాభిలాషయే దూష్యము. గురుకాంతతో రాత్రింబగళ్ళు నీ విట్లు లోకోపవాదమునకు వెఱువక వర్తింప నేమనగలవారము. మీ కేమియుం దెలియకున్నది. మీచిత్తజవికారము లరయ బరిహాసాస్పదములైయున్నవి. కొంచెము కాలములోనే మన గురువుగారికి గూడ తెలియునట్లు తోచుచున్నది. నీ వీలోపల నింటికి బోయిన బాగుగనుండునని నాకు దోచుచున్నది నీకు బ్రాణమిత్రుండ గావున నింతజెప్పితిని. పిమ్మట నీయిష్టమని మందలించెను.

పైత్యరోగము గలవాని నాలుకకు పంచదార సైతము చేదుగా నుండునట్లు మదనవికారమత్తుండనగు నాకు వాని నీతివాక్యము లేమియుం జెవులకెక్కి నవికావు. అంత నొక్కనాడు మా గురువుగారెద్దియో పనిబన్ని మరల నూరికి బోయెదననిచెప్పి విద్యార్థుల నెవ్వరిని వెంటదీసికొనిపోక తానొక్కరుండే పయనమైపోయెను. అప్పుడు సురుచియునట్టి అవసరము పెక్కుకాలమునకు దొరికినదని మిగుల సంతసించుచు మనంబున కోరికె లువ్విళ్ళూరుచుండ సాయంకాలమగుటకు వేచియుండెను. విదార్ధులు మరికొందరుగూడ నుండిరి. గనుక పగలేమియు మాటాడుటకు వీలు చిక్కినదికాదు. ఆ దినమున సూర్యుని గుఱ్ఱముల పాదములు విరిగిపోయినని కాబోలు నెప్పటికిని ప్రొద్దు కుంకినదిగాదు.