పుట:కాశీమజిలీకథలు -02.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళయాళ దేశము కథ

37

అప్పుడు మరల వృద్ధసభాపతి అయ్యా! మనము బలిపురుషులకందరి కాళ్ళకు జేతులకు సంకెళ్ళువైచికదా యొకచోట నుంచుచుంటిమి. అట్లు బద్ధులైనవా రేమి చేయగలరు. నూర్వురైన నొకటియే, యొకండైన నొకటియే, రావణుడంతవాడు బద్ధుడై యేమియు జేయనేరక కారాగృహంబున పెద్దకాలము పడియుండలేదా? తక్కినవారి నెన్న నేల? మఱియు వారినందరిని నొక్కనా డొక్కసారియే తీసుకొనిపోకూడదు, వారందరు నొకచోట లేరుగదా? యెవరింటియొద్దనుండి వారే రహస్యముగా దీసికొనిపోయిన నలజడి యుండదు. కావున నట్లు చేయుటయే యుత్తమము ఇంతకన్న వేరొక యుపాయము లేదని నాకు దోచుచున్న దని పలికెను. ఆ మాటలకందరు సమ్మతించిరి. అట్లు చేయుటకు రేపటి నుండియే యారంభింపవలయునని స్థిరపరచుకొని యంతటితో సభ ముగించుకొని తమ నెలవులకు బోయిరి

ఆమ్మరునాడు రాత్రి సభాపతులందరు నిరూపించుకొనినట్లు తమతమ గృహంబులలో నున్న బలిపురుషులను బ్రచ్ఛన్నముగా నా పాతాళగృహములకు జేర్చిరి. ఇంద్రద్యుమ్నుండు నాటి యుదయంబున స్థలాంతరమందు దానువోలె గరచరణంబులకు నిగళంబులు దగిలింపబడియున్న పెక్కండ్రు పురుషులంజూచి వెరగందుచు నిట్లు తలంచెను. ఆహా! వీరిమంత్రశక్తి మిగుల గొనియాడదగియున్నది. అంటినమాత్రమే మేల్కొను నేనుసైత మిచ్చటి కెట్లు వచ్చితినో తెలియకుంటిని. లేకున్న వీరందరు నెట్లు మాయజేయగలరు? అన్ననా! యీ యూర నిన్నినరహత్యలు జరుగుచుండ దెలియకున్నవా డీరాజెంత మందమతియోగదా! నాకీ సంకెళ్ళు లేకున్న నీయూరి ప్రజల నందరను శక్తికి బలియిత్తునుగదా! కాలవశమున నిట్లయితినేమి సేయుదును! పాపము! నేనువలె వీరును మోసపోయిరి కాబోలు. దైవ మాయువు మూడిన వారి నీయూరికి జేర్చుచుండును. వీరందరు నెట్లుచిక్కిరో యడిగి తెలిసికొనియెదగాకయని నిశ్చయించి ప్రతిపురుషు నొద్దకునుబోయి నిష్కారణబంధమునకయి వగచుచుండ మంచిమాటల నూరడింపుచు నీ వెట్లు వీరికి జిక్కితివో చెప్పుమని యడుగుచు నతండు చెప్పినరీతిని విని వెరగుపడుచు నీప్రకారంబు క్రమంబున నందరిని దెలిసికొనిపోయెను. వారిలో గడ్డమును. మీసములుసు బెంచి దివ్యతేజంబున నొప్పుచు, యోగిరూపము వహించి యెద్దియో తలంచి చింతించుచున్న యొక పురుషు నొద్దకు బోయి అయ్యా! తమ నివాస మెచ్చట? కుల మెయ్యది? యీపురం బేమిటికి వచ్చిరి? మి మ్మెట్లు వశపరచుకొనిరి? మీయాకారము జూడ వేడుక యగుచున్నది. మీవృత్తాంతము వినవలతుం జెప్పెదరే ! ఏ నింద్రద్యుమ్నుండనునాడు. మాది ద్రోణపురము. సింహమును జంపుటకై యడవికివచ్చితి. అచ్చట కాశీరాజుకూతురు విశాలాక్షి యనునది మగనితోగూడ శత్రుభీతిచే బారిపోయి వచ్చుచు మార్గంబున గుర్రముమీదనుండి మగడు జారిపడుటయు నతండు మృతినొందెనని శోకింపుచుండ నాధ్వని విని యక్కాంత చెంతకుపోయి యామె నోదార్చి మగనింగూర్చెదనని శపథము చేసితిని. ఇంతలో