పుట:కాశీమజిలీకథలు -02.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళయాళ దేశము కథ

33

గితినని యుత్తరము చెప్పెను. అయ్యా! యీ యూర నిన్నియిండ్లు గలిగి యుండగా మీకు బసజేయుటకు స్థల మెచ్చటను దొరకినది కాదు కాబోలు? యీ యర్ధరాత్ర మెచ్చటనో యున్న సత్రమునకు బోవలయునా? మీవంటివారు నిమిత్తము లేక ప్రార్థించినను వత్తురా? గృహస్థులై యున్నందులకు ఫలము మీ వంటివారిని బూజించుటయేకదా అతిథిపదధూళిసోకని భవనము వనమని యార్యులు చెప్పుదురు. గంధర్వనగరప్రాయమైన యీ సంసారమందున్న సారంబింతియకాక మరేమియున్నది. మీరు మా పుణ్యవశమున సత్రమునకు బోవుచు దారితప్పి యిట్లు వచ్చితిరి. ఈ రాత్రి మా యింట నింతయాతిథ్యము పుచ్చుకొని యుదయమునం బోయెదరుగాక లోనికి రండని మిక్కిలి భక్తితో బ్రార్ధింపదొడగినది.

అమ్మానవపతి యా మానవతి భయభక్తివిశ్వాసములకు మిగుల నానందము నొందుచు నౌరా! వీరి మర్యాద లెంత వింతగానున్నవి. పట్టణంబున నెంతధర్మాత్ములైనను బసయిచ్చుటకు సమ్మతింపరు. బాటసారి నన్ను మోసపుచ్చుటకై యట్లు చెప్పెను కాబోలు. విదేశస్థుని మాయలెట్లు గ్రహింపనగును. తఱుచు టక్కరివాడే మంచివారిని టక్కరులని చాటుచుండును. లోకంబున నందరు దుర్మార్గులుగా నుందురా ? ఇందు జూచిన వారెల్ల నన్ను దమయింటికి రమ్మని బ్రతిమాలుచుండిరి. ఇదియునుగాక సత్రమునకు బోవుదారి తప్పితినట. ఈ యర్థరాత్రి మెచ్చటగనుం గొనగలను. ఈ రాత్రి వీరి యింటనుండి యుదయంబున బోయెద. నింతలో నేమి మోసము చేయుదురని తలంచుచు నామె యింటికి వచ్చుటకు సమ్మతించెను.

పిమ్మట నా ముద్దుగుమ్మ యమ్మనుజపతిని దోడ్కొని పోపుచు గనుసంజ్ఞ జేసినంత బరిచారికలు బంగారు కలశములతో నీళ్ళు దెచ్చి యిచ్చిరి. వానిని బుచ్చుకొని అతడు తన యొద్దనున్న పుస్తకము మూటయు నా చావడి గుమ్మముపై యరలోనుంచి కాళ్ళు గడిగికొని లోనికి బోయెను. ఆ చిన్నది అతనిని మేడ మీదికి దీసికొనిపోయి ఒక కనకపీఠమునం గూర్చుండబెట్టినది. అమ్మేడయందు గలఅలంకార మతినిస్వాంతమునకు వింతవేడుక గూర్చినది. వారుచేయు నుపచారములన్నియు రాజోచితముగా నున్నవి. తన్నుఁ జక్రవర్తిగా నెరింగి అట్లు చేయుచున్నవారని అతడు భ్రాంతిపడి సంతోషము జెందుచు వీరు కోరిరేని తన దేశములో గొన్ని గ్రామము లిత్తునని నిశ్చయించుకొని యుండెను.

పిమ్మట అతనికి బెక్కుపిండివంటలతో భోజనము పెట్టిరి. భోజనము సేయు సమయమున నా రమణి అతనియొద్ద కూర్చుండి ఆర్యా! నెమ్మదిగా భుజింపుము. శాకము లేమియు లేవు. ప్రొద్దు పోవుటచే వంటకములు తరుచు లభ్యములు