పుట:కాశీమజిలీకథలు -02.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునందకథ

249

సునందకథ

అల్లనాడు నే నరణ్యమధ్యములో బుత్రకునిం గని యొడలెరుంగక దాహము దెమ్మని రత్నవతికిం సంజ్ఞ చేసితిని కదా! రత్నవతి యుదకము దెచ్చుటకై యరిగిన వెనుక నాకు బరితాప మెక్కువైనది. అట్టి సమయమున నొక్కకోతివచ్చి నాయొడిలో నున్న ముద్దుపట్టి నెత్తుకొని పోవుచుండగా గన్నులార జూచుచుండియు వారించుటకు శక్తిలేమింజేసి చేతులు కాళ్ళును కదపలేక చింతించుచు మూర్చపోయితిని. ఇంతలో నాదారి నొక వర్తకుడు మణిమంతుడను వాడు అత్తవారి యింటియొద్ద నుండి పల్లకీమీద భార్యను దీసికొని వచ్చుచు దారిలో మూర్ఛ మునింగియున్న నన్ను జూచి దయామతి గావున జాలిపడుచు బిలిచి పలుకకున్నంత నన్ను గూడ నయ్యాందోళికమున నెక్కించుకొని తమపురికి దీసికొనిపోయెను.

ఇంటికడ మంచివైద్యుల బిలిపించి తగిన చికిత్స చేయించుటచే నాలుగు దినములకు స్మృతివచ్చినది. క్రమక్రమముగా బలము చేరినంత పుత్రకునికై చింతింపు చుండగా నాదంపతులు మిక్కిలి మంచివారు కావున నన్ను నిత్యము నోదార్చుచుండిరి. అని చెప్పినంత అదృష్టదీపు డతని పేరును వ్రాసికొని యప్పుడే యా మణిమంతుని యేనుగపై నెక్కించి తీసుకొని వచ్చునట్లు తగిన దూతల నంపెను. సునందయు దరువాయికథ యిట్లు చెప్పందొడంగెను. అట్లు నేనా మణిమంతుని యింటిలో సురక్షితముగా రెండుమూడు సంవత్సరము లుంటిని. అతని భార్య అంబిక అనునది నాయందు గౌరవముంచి నీచకృత్యములకు నియోగింపక సమానప్రతిపత్తిగా జూచుచుండెను.

అంత నొకనాడా యంబిక తమ్మునికి వివాహ మగుచుండ అమ్మహోత్సవమునకు నన్నుగూడ దీసికొని పోయినది. అచ్చటివారెల్ల నన్నామె దాసియని నీచ కృత్యములకు నియోగించువారు నేను బెద్దవారు చెప్పుచున్నవారు కదాయని తీసివేయ