పుట:కాశీమజిలీకథలు -02.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యవతి కథ

247

డదృష్టదీపుడనియు అతని తమ్ముడు హరిదత్తుడనియు తెలిసికొని మిక్కిలి సంతసించుచు అతని పాదంబులంబడి తెలియకచేసిన యవజ్ఞను సైరింపుమని వేడుకొనెను. ఆ వార్త అంతలోనే పట్టణమంతయు వ్యాపించినది. అదృష్టదీపుడు వచ్చెనని విని నంత యాచకులు బ్రాహ్మణులును వేనవేలు ప్రోగుపడిరి. అదృష్టదీపుడప్పుడు గొప్ప శిబిరములను దెప్పించి కేళీశైలమున వేయించి అది నెలవుచేసికొని దేవీభవనమునంగల వస్తువులును, మణులును లోహములు నదివరకు దనకొరకు దీర్థములవెంబడి తిరుగుచున్న బ్రాహ్మణులకును, దరిద్రులకును దానముచేయదొడంగెను. దేవీసౌధమునంగల ద్రవ్యమంతయు అక్షయమైనది గనుక నతండెంత ద్రవ్యము గరుచుపెట్టినను కొదవ లేకున్నది. అదృష్టదీపుడు పుష్పపురిలో దమ్మునికి వివాహము చేయుననువార్త జగంబంతయు వ్యాపించినందున భూమియందుగల విద్వాంసులందరును అచ్చటికి రాదొడంగిరి.

ప్రియంవదా హరిదత్తుల వివాహము

వచ్చినవారినతండు కుబేరులంజేసి యనుపుచుండెను. దానితో నిది యొక రత్న మిచ్చెనేని గోటీశ్వరు లగుచుందురు. తరువాత అదృష్టదీపుడు ధర్మపురినుండి రత్నపతిని బ్రహ్మావధానిని బిలిపించి వారివలన మరల నెరుగనట్లు తమ పూర్వవృత్తాంతము దెలిసికొని మిక్కిలి విచారింపుచు దల్లిదండ్రుల చెఱ విడిపించుటకై ప్రయత్నించి కాంతిమతిని జతురికతో గూడ అచ్చటికి రప్పించి యుచితసంభాషణలచే నోదార్చెను.

మరియు ధర్మపాలుని భార్యయగు సునందజాడ జెప్పినవానికినిగాని, యామెను దీసికొని వచ్చువానికిగాని నూరుకోట్ల దీనారములు గానుకగా నిత్తుమని ప్రకటించుటయేగాక ప్రతిగ్రామము నందును జాటించున ట్లాజ్ఞాపించెను. అదృష్టదీపుడు ప్రతిదినము నెచ్చటనున్నను నూరుకోట్ల బంగారము బ్రాహ్మణులకు దానము చేయు చుండుటచే అతని ఖ్యాతి పూర్వముకన్న భూమియంతయు నెక్కువగా వ్యాపించినది.

భుమియందుగల రాజులకందరకును రావలయునని యుత్తరములు వ్రాసెను కాని చోళదేశప్రభువగు వసురక్షితునికి మాత్రము వర్తమానము చేయలేదు. అంతకు