పుట:కాశీమజిలీకథలు -02.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

239

మరియు మీ కందరకు నమ్మేడలోనివిశేషము లన్నియుం చూపెదరండు. నన్ను బట్టికొని యుండుడని అందరికి బోధించి యొకరి వెనుక నొకరు బట్టుకొని నడచుచుండ గ్రమంబున నా ప్రాసాదములోనికి దీసికొనిపోయెను. అచ్చట నుండు వింతలను చూచుచుండ వారికది స్వర్గమనియు స్వప్న మనియు మాయయనియు దోచు చుండెను. అదృష్టదీపుడందలి వృత్తాంతము కొంత కొంత ప్రియంవదకు దెలిపి యా అమ్మవారి యెదుట హరిదత్తునిచే బ్రియంవద పాణి గ్రహింపజేసి తానుజేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనియెను. అప్పుడు హరిదత్తుడు ప్రియంవద చెయ్యిపట్టుకొని అమ్మవారికిని, అన్నకును నమస్కరించెను.

అదృష్టదీపుడు తమ్ముని దీవించి గారవించుచు, హరిదత్తా! నీవి మత్తకాశిని కొరకు బ్రాణత్యాగమున కొడంబడితివిగదా? దైవకృపచే నిప్పటికి గృతార్థుడ వైతివి! నా మనము చల్లనైయున్నది. నేడు మన యభీష్టదేవతలు ప్రసన్నులైరని పలుకగా నతండు చిరునగవు మొగంబునను మండనంబై యొప్పుచుండ నన్నతో నిట్లనియె.

సత్యవతి కథ

అన్నా! నేనీ ప్రియంవదను గామించి యట్టిపనికి బూనుకొనలేదు. బలవన్మరణము పాపమనియు నీరీతి మృతినొందిన నిరయము లేదనియు దలంచియే పూనుకొంటిని. అంత తెగువ యేల చేయవలయునంటేని వినుము. నన్ను మాపెంపుడుతండ్రి యింటిలో పోరు పడనేరక విద్యాభ్యాసకైతవంబున నన్నొక అగ్రహారంబున సోమశేఖరుడను పండితుని కప్పగించెను. నేనా యగ్రహారములో మధూకరవృత్తిచే జీవనము చేయుచు నాయనయొద్ద జక్కగా విద్యాభ్యాసము చేయుచుంటిని. నా బుద్ధికౌశల్యము, గుణసంపత్తియు దెలిసికొని మా యాచార్యుడు కొంచెము స్థితియున్నవాడు కావున గొన్నిదినముల కావృత్తి మానిపించి తన యింటనే భోజనసత్కారము చేయుచు జదువు జెప్పుచుండెను.

ఆయనకు బదియారేడుల ప్రాయముగల యొక కూతురు గలదు. దానిపేరు సత్యవతి. అది రూపంబునను గళాకౌశలంబునను ననన్యసామాన్యయై యున్నది. అట్టి చిన్నదానిభర్త పెండ్లియైన వెంటనే కాశికిబోయి యప్పటివరకు రానందున నా సుందరి పూర్ణయౌవనోదయమున జూచువారికి విచారము గలుగచేయుచుండెను. అట్టి సమయమున నే నచ్చట విద్యాభ్యాసము చేయుచుంటిని. దానికి మొదటనుండియు మంచివాడుకయే యున్నది. ఒకనాడు గురువుగారు రాత్రి భోజనముచేయుచు నెద్దియో పుస్త