పుట:కాశీమజిలీకథలు -02.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

కాశీమజిలీకథలు - రెండవభాగము

చెప్పుమని బలభద్రుం డడుగుచుండగనే యతండు వడిగా నెచ్చటికోపోయెను. తరువాత బలభద్రుడు సంశయాకులితచిత్తుండై యున్మత్తుని క్రియ కొంతసేపా ప్రాంతభాగముల గ్రుమ్మరి చీకటిపడిన కొంతసేపటికి మరల సత్రములోనికి వచ్చెను.

సీ. ఒకచోట శ్రోత్రియప్రకరంబు జందెముల్
            వడకుచు వేదముల్వల్లె చేయ
    ఒకమూల శ్రోతల కకలంకముగ బుధుల్
            రాజుబురాణ ధోరణులుదెలుప
    ఒకవంక భూదేవనికరంబు రెడ్డిగం
            బులదీర్చివివిధగాథలవచింప
    ఒకప్రక్క బండితు లుధ్ధతిగావ్య నా
            టక సత్ప్రసంగంబులొనరజేయ.

గీ. ఒక్కదెస శాస్త్రపాఠంబు లొక్క వైపు
    సకలలౌకిక సంబంధ చర్చలొప్ప
    సందడించెడి సత్రంబు సత్రాముగతి
    విబుధలోక మనోజ్ఞమై వెలసియుండె.

అట్టి సత్రమంతయు బెక్కుదేశములనుండి రాబడిన బ్రాహ్మణులచే నావరింపబడియున్నది. బలభద్రుండును నాబ్రాహ్మణ బృందమునకు నమస్కరించి వీరి వలన భూలోకవృత్తాంత మంతయు విదితమగునని నిశ్చయించి వారి మాటలు విను తాత్పర్యముతో నాప్రాంత మందొకచోట గూర్చుండి యుండెను. అప్పుడందున్న వారిలో అచ్చన్న శాస్త్రి బ్రహ్మావధానియను బ్రాహ్మణులీ రీతి మాట్లాడుకొనిరి

అచ్చన్నశాస్త్రి :- బ్రహ్మావధానిగారూ ! మీరు మిగుల వృద్ధులై యింత దూరమెట్లు వచ్చితిరండి? మీకు సంతానమైనను లేదుగదా? హాయిగా యింటియొద్ద గూర్చుండి రామా! కృష్ణా! యని కాలక్షేపము చేసికొనరాదా! మాకనిన గుటుంబ భారము బలసినది కావున తిరుగక తప్పదు.

బ్రహ్మావధాని :- అచ్చన్నశాస్త్రిగారా? మిమ్ములను జూచి పెద్ద కాలమైనది. ఈ నడుమ నా యోగక్షేమ మేవి యు మీరు తెలిసికొనడములేదు. నాకును ఒక పిల్లకాయ కలిగినాడు. వాని పెండ్లికొరకే యింతదూరము వచ్చితిని.

ఆచ్చన్న :- ఆలాగునా? తెలియక పలికితిని క్షమించండి.

బహ్మావ :- దానికేమిలెండి. ఇచ్చట రేపు భారసాల జరుగునా? యేదియో యడ్డము వచ్చినదని చెప్పుచున్నారేమి? అదృష్టదీప మహారాజుగారికి కుమారుడు గలిగెననియు భారసాలయనియు విని వచ్చితిని. అమ్మహారాజు దానకర్ణుడనియు మా