పుట:కాశీమజిలీకథలు -02.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

221

దత్తుడు బ్రియంవదకై ప్రాణత్యాగమున కైనను దెగించి చిక్కులం బడెనుగదా? అతనిని రక్షింపు తలంపుతో నేనడ్డుపడి దైవకృపచే నాయిక్కట్లు దాటించితిని.

నేను హరిదత్తుడనియే యెల్లరు భ్రాంతి పడుచున్నవారు. అతడు నేను నొక్కరూపని దీనిందేటబడుటయేకాక నీవుసైతము చూచినదేకదా? మొదటినుండియు బ్రియంవదను హరిదత్తునితో గూర్పవలయుననియే నా తలంపు. అట్టికాంత నిప్పుడు నేనెట్లు పెండ్లియాడుదును. వారు నన్నట నిర్బంధింపగా దీక్షాకైతవంబునం దాటించు కొనివచ్చితిని. బ్రాహ్మణాధీనము చేసినది మరల స్వీకరింపవచ్చునా! కావున నెట్లయినను హరిదత్తునితో నీమత్తగాశినిం గూర్పవలయు. అతండిప్పుడెచ్చటికి బారిపోయెనో తెలిసికొని తీసుకొనిరావలయును. ఇదియే మనము చేయదగిన కార్యము. రూప సాదృశ్యమువలన తనని నన్నుగా భావించి మన్నింతురు. ఇదియే నా నిశ్చయము. దీనికి నీవేమనియెదవని యడుగుచు దాను క్రీడాశైలంబున జూచిన విశేషములన్నియుం జెప్పెను.

అప్పుడా బలభద్రుడు మిక్కిలి యాశ్చర్యమందుచు నతని ధార్మికబుద్ధికి మెచ్చుకొనుచు జితేంద్రియత్వమునకు శిరఃకంపము చేయుచు దుద కదృష్టదీపుడు చెప్పినప్రకారము హరిదత్తుని వెదకి తీసికొని వచ్చుటయే యుత్తమమని యొప్పుకొనియెను. పిమ్మట వారిరువురు తిరుగవచ్చుటకు గడువేర్పరచుకొని యారాత్రియే చెరియొక మార్గంబునఁబడి పోయిరి.

హరిదత్తుని కథ

అందు బలభద్రుడు క్రమంబున బట్టణములును, బల్లెలును, గ్రామంబులును వెదకికొనుచు నొకనాడు సాయంకాలమునకు ధర్మాపురముచేరెను. పూర్వపరిచితమగు నదృష్టదీపుని సత్రములో బసజేసి యాపట్టణ విశేషములరయు తలంపున సాయంకాలమున రాజమార్గంబునంబడి పోవుచుండ బూర్వపరిచితుండగు నొక మిత్రుండెదురుపడి యోహో! బలభద్రా ఎచ్చటనుండి వచ్చితివి? ఇంత కాలము కుశలముగా నుంటివా? యని యడుగగా నతండును తగురీతి బ్రత్యుత్తరమిచ్చి, మిత్రమా! హరిదత్తుడను బ్రాహ్మణకుమారు డీయూరు వచ్చిన జాడ నీకేమైనం దెలియదు కదాయని అడిగెను.

అతండు నొక్కింత ధ్యానించి యోహో! మెల్లగా మాట్లాడుము. అతని నీవెరుంగుదువా యేమి? అతని గురించి యీ యూర గొప్పవితర్కముగా నున్నది. ఇప్పుడు నేను తొందరగా బోవుచుంటిని రేపటిదినంబున మా యింటికి వత్తువేని యా విశేషములన్నియు సావకాశముగా వక్కాణించెద. ఆ కథ ప్రకాశముగా జెప్పుకొనరాదు. ఇంకను రహస్యములో నున్నది. అని పలుకుటయు నెట్లెట్లూ కొంచెము జూడ