పుట:కాశీమజిలీకథలు -02.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

219

పటములోని విశేషములన్నియు యతి జెప్పినదే? ఇంతకు బూర్వ మీరహస్యము లేరికిం జెప్పలేదు. గుప్తముగా వ్రాసి దాచి యుంచితిని. చూతువుగాని రమ్మని యొక మందసము దాపునకు బోయి అందున్న యొక గ్రంథములో జ్ఞాపకార్ధమై సంక్షేపముగా సంజ్ఞాపూర్వకలిపితో నున్న యా విశేషములను దానికి జూపెను. కలహంసికయు ప్రియంవదయొక్క గాంభీర్యమునకు సంతసించుచు ఇంచుబోడి! నీవి రహస్యము నాతో జెప్పక యిన్నినాళ్ళెట్లు దాచితివో కాని యే సంగతియు నీతో జెప్పక నేనొక నిముషమైనను తాళలేను సుమీ? యని పలుకగా కక్కలికి యులికిపడి, అక్కా! నీ వట్లనుచున్నా వేమి? యతీశ్వరు డెవ్వరితోడను జెప్పవలదని యాస బెట్టియున్నవాడు. కావున దాచితినిగాని లేకున్న నేను మరల నీతో జెప్పక నిలువగలనా అని పలుకుటయు సంతసించి యాత్రమున గలహంసిక యిట్లనియె.

రమణీ! ఈ మాటలకేని ముందరికార్య మాలోచింపుము. ఈ హరిదత్తు నంతకు బూర్వము నీవు జూచితివిగదా! రూపంబున నీ కనుకూలుడైనవాడే యగునా అని పలికిన నక్కలకంఠియు నుత్కంఠతో దైవ మనుకూలకాలంబున మరియొక లాగున నెట్లు జేయును. అయినను నీవు ముందు నాకు బదులుగా బోయి యీ హార మతని మెడలో వైచి యిచ్చటికి దీసికొనిరమ్ము. దానసర్వము విదితమగునని పలుకుచు హరిదత్తుడు నా ప్రశ్నలకు సదుత్తరము లిచ్చెను. అతండు నా ప్రాణేశ్వరుడు. త్రికరణములచేత హరిదత్తుని నేను వరించితిని. తరువాత కృత్యములు నిర్వహించుటకు దేవరయే ప్రమాణమని యొకపత్రిక వ్రాసి తండ్రి కిమ్మని చెప్పి కలహంసిక నంపెను.

మిక్కిలి సంతోషముతో నాయోషామణి యాస్థానమునకు బోయి అందు రాజకింకరులచే నావృతుడై యున్న అదృష్టదీపుని, నతని గురించి విచారించుచున్న యా రాజవాహనునింజూచి యాశ్చర్యమందుచు రాజుగారికి నమస్కరించుచు బ్రియంవద యిచ్చిన యుత్తరము చేతికిచ్చి హరిదత్తు డెచ్చటనున్నవాడని యడిగెను. రాజవాహను డా యుత్తరమును జదువుకొని యపరిమితానందము జెందుచు నెదుర నున్న నదృష్టదీపుని నిరూపించి యితడే హరిదత్తుడు చూడుము కలహంసికా! నేటికి మా వంశము పవిత్రముచేయ వచ్చే సెనని పలుకుచు నతని గౌగలించుకొని, అనఘా! నిన్ను మేమిదివరకుబెట్టిన యిడుములన్నియు సైరింపవలయు. నీ మహిమ యెరుంగలేక నిన్ను మానవసామాన్యుండవని తలంచి వృధా శ్రమబెట్టితిమి. నిన్ను నా కూతురు వరించి నట్లుత్తరము వ్రాసినది. నీవు మా కల్లుడవైతివని పలుకుచు నతని మిక్కిలి గౌరవించి తమయర్థసింహాసనమున గూర్చుండ బెట్టుకొనియెను.

కలహంసికయు నతనింజూచియు వెఱగుపడుచు, అయ్మో! ఇది మేమివింత. ఇతండు మిత్రగుప్తుడనువాడుకాడా? హరిదత్తుడనుచున్నా రేమి? ఇతడింతకుముందు నాతో మాట్లాడివెళ్లెనే. బాగుబాగు. పురుషసింహా! పేరుమార్చిన లాభమేమియున్నది.