పుట:కాశీమజిలీకథలు -02.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కాశీమజిలీకథలు - రెండవభాగము

చున్నవాడేమి. అయ్యయ్యో! వినినంత నా మేనగంపము జనింపుచున్న దేయని పలుకగా బ్రియంవద దానితో బోటీ! రాజధర్మము మిగుల సూక్ష్మమైనది. అతండట్టి ప్రతిజ్ఞబట్టి యున్నవాడు. పతిజ్ఞాభంగము సైతము పాపహేతువని పెద్దలు చెప్పుదురు.

ఆ మాటల సంగతి మనకేటికి. ఇప్పుడు నాకొకటి తోచుచున్నది. వాని నిచ్చటికి రప్పించుటకంటె నాతడిచ్చు నుత్తరములు వ్రాయించి తెప్పించుకొనిన యుక్తముగా నుండునని తోచుచున్నది. అవి యుచితముగా నుండిన మనము ధన్యులమే కదా? లేనిచో వాని నేమి చేయవలయునో అట్లు చేయింతునని పలికి అక్కలికి కోపించి యా మాటలే మరల జీటిలో వ్రాసి తండ్రికంపినది. ఆ రాజవాహనుండా చీటిం జదువుకొనుచు దనయెదుట నున్న యా రాజకుమారుని కా సంగతి జెప్పెను. అప్పుడతండు వారి నడిగి చిత్తరువు వ్రాయు సామాగ్రిం దెప్పించుకొని తాను జూచిన విషయము లన్నియు దేటయగునట్లు వ్రాసెను. ముందుగా బుష్పపురి నొకచోట వ్రాసి దాని కుత్తరముగా గేళీశైలము దాని శిఖరము మీద మూడంతరములు గల భువనేశ్వరీ దేవాగారము లిఖించెను.

మఱియు నాయాయీయంతరంబులం గల విశేషములన్నియు దేటతెల్లముగా వ్రాయుచు పైభాగమున భువనేశ్వరీదేవి విగ్రహమును దాను చూచిన ప్రకార మైదుముఖములు బదిచేతులు, వాని రంగులును నచ్చుపడునట్లు అద్దేవి పీఠమున భువనేశ్వరీ దేవియనియు వెనుక గోడమీదనున్న పద్యము నుచితస్థానముల వ్రాసెను. మరియు నాయాచోటుల సంజ్ఞలు దెలియుటకయి అక్షరములతో గూడ వ్రాసెను. ఆ రీతి దాను చూచిన రహస్యమంతయు జిత్రఫలకమున వ్రాసి యెవ్వరును జూడకుండ మడచి అది యా రాజుగారికిచ్చెను.

అతండును గుప్తముగా దానిని గూతురి నంతఃపురమున కనిపెను. ప్రియంవదయు గలహంసికతో అప్పుడెద్దియో ముచ్చటింపుచు దాది తనయొద్ద తెచ్చి పెట్టిన చిత్రఫలకమును మొదట నంతశ్రద్ధగా జూడక సఖురాలి ప్రోత్సాహమున నెట్టకేనాపటమును విప్పి చూచినది. మున్ను సన్యాసి తనకు జెవిలో జెప్పిన విషయములన్నియు నందుంచుటచే విభ్రాంతస్వాంతయై అక్కాంత యొక్కింతసేపు వితర్కించి మేనంతయు గగుర్పొడున గ్రక్కున లేచి బిగ్గర గలహంసికం గౌగలించుకొనియెను. అదియును ముదము జెందుచు, మదవతీ! మన భాగ్యదేవత ప్రసన్ను రాలయ్యెనా యేమి? వడిగా జెప్పుము. నాకు శ్రోత్రానంద మాపాదింపుము లెమ్ము. విశేషములేమి అని అత్యాతురముగా నడుగుటయు నచ్చేడియ యెట్టకే సంతోష మాపుకొనుచు గలహంసిక కిట్లనియె.

చెలియా! కలయో నిజమో కాని యా పటములో నేను గోరిన యుత్తరములున్నవి. నా పూర్వపుణ్య ఫలంనిప్పటికి సఫలమైనది గాబోలు. చూడుమిదిగో! ఈ