పుట:కాశీమజిలీకథలు -02.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

217

కొందరు వంచకులు నన్ను జూడవలయునను తాత్పర్యముతో మేము చెప్పెదమని వచ్చి యెద్దియో ప్రేలిన సరిపడునా? వానికి దగిన ప్రాయశ్చిత్తము సేయం బుచ్చితిని. అదృష్టదీపుని మిత్రుడును మహోన్నతుడువలె దోచుచున్నవాడు. కావున నట్లంటినికాని యతి వచనము తలంచుకొనిన భయమగుచున్నది. ఈ రత్నములం జూడ మనుష్యలోకసంబంధములుగా దోచదు. వీని మా తండ్రికి జూపిన నతని కేమి తోచునోయని అనేకప్రకారముల నా రత్న ప్రభావమగ్గింపుచు దానితో ముచ్చటింపు చుండెను. ఇట్లిరువురు మాట్లాడుకొనుచున్న సమయంబున నొక దాది యుత్తరమొకటి దెచ్చి, భర్తృదారికా! దీని నయ్యగారు మీ కిమ్మనిరని పలుకుచు నొక యుత్తరము ప్రియంవదకిచ్చినది. ఆమె దానిని బుచ్చుకొని విప్పి చదివిన నిట్లున్నది.

పట్టీ! హరిదత్తుడను బ్రాహ్మణకుమారుని నీ విదివరకు వినియున్నదానవు కదా. అతని నొకకారణముచేత నురిదీయక నారుమాసములు గడువిచ్చితిని ఆ చిన్నవాడును మ్రుచ్చువలె మొన్నను రక్షకపురుషులకు దేలియకుండ బందీగృహమునుండి పారిపోయెను. కాని దైవవశము చేత మరల వారికే చిక్కెను. వాని నాయొద్దకు దీసికొని వచ్చి యతడు చేసిన అపరాధాంతరమును దెలియపరుచుచు వెంటనే యురిదీయుట కుత్తరము దయచేయవలయునని వాండ్రు ప్రార్థించిరి. నేనును వెంటనే అట్టియాజ్ఞ యియ్యదలచుకొనుచు దీనికి నీవేమి చెప్పెదవని అతని నడిగితిని. అతండు కొంతసేపు ధ్యానించుచు నెద్దియో గొడవ చెప్పబోయను. కాని మరల నడంచుకొనుచు జివరకు నాతో నిట్లనియె. దేవా! మీ యధికారములో మీరేమి చేసినను సాగునుగదా మితియిచ్చి మరల నింతలో నురిదీయుట కేమి కారణమున్నది. నేను బారిపోయితినని గదా వీరు జెప్పుచున్నారు. ఆ మాటలెంత నిక్కువములో యాలోచింపక యాజ్ఞ యిచ్చెదనని నేనేమి చెప్పుదును. కానిమ్ము. నీ కూతురిచ్చిన ప్రశ్నలకిప్పుడు ప్రత్యుత్తర మిచ్చుటకు సిద్ధముగా నుంటిని నన్నొకసారి యామె యొద్దకు దీసికొని పొండని యడిగెను. దానికేమియు జెప్పక నీ యభిప్రాయము దెలిసికొనుటకయి యుంటిని. దీనికి నీవేమి చెప్పెదవో వ్రాయుము. అని యున్న యుత్తరము చదువుకొని యమ్ముదిత పెదవి విరుచుచు గలహంసిక కిట్లనియె.

కలికీ! అతని తెలివి మొదటనే తెలిసినది. ఇంతలో నతనికి సూక్ష్మబుద్ధి యెచ్చటనుండి వచ్చినది. ఊరక చావలేక కాలక్షేపము చేయుటకై యట్లనుచున్న వాడని యూహించెదను. మరల రప్పింపనేల? దీనికి నీవేమనియెదవని యడుగగా నక్కలహంసిక యిట్లనియె. అక్కా! నీవాలాగున చెప్పరాదు. ఎప్పటికేబుద్ధి తోచునో? అతండు చెప్పిన సంగతులు వినియే పైకార్యము జరిగించుకొనవచ్చును. బ్రహ్మహత్యాదోషమున కింతయేని వెరువక మీ తండ్రియంత సాహసము చేయు